Begin typing your search above and press return to search.

నెలకో సినిమాతో స్టార్ హీరోయిన్.. సమ్మర్ స్పెషల్ ట్రీట్!

By:  Tupaki Desk   |   14 Feb 2021 2:30 AM GMT
నెలకో సినిమాతో స్టార్ హీరోయిన్.. సమ్మర్ స్పెషల్ ట్రీట్!
X
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజాహెగ్డే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్ బిగ్ మూవీస్ తో మోస్ట్ ఫేవరేట్ అయింది. ఈ ఏడాది పూజకు చాలా స్పెషల్ కాబోతుందట. ఎందుకంటే అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు మరొకటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. పూజ నటించిన మూడు సినిమాలు వరుసగా నెలకో సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. అవే మెగాస్టార్ ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాలు. అయితే మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో రాంచరణ్ సరసన నటిస్తోంది పూజ.

ఈ సినిమాలో రాంచరణ్ తో పాటు పూజ ఎమోషనల్ క్యారెక్టర్ లో కనిపించనుందట. ఇదిలా ఉండగా.. ఆచార్య సినిమా సమ్మర్ కానుకగా మే 13న థియేటర్స్ లోకి రానుంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ.. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో పూజ చాలా వినోదాత్మక క్యారెక్టర్ పోషించిందట. ఈ రెండు సినిమాలతో పాటు డార్లింగ్ ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్ సినిమాలో నటించింది పూజ. పీరియడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో ఐదు భాషలలో విడుదల కాబోతుంది. అయితే సినీవర్గాల సమాచారం ప్రకారం.. రాధేశ్యామ్ మూవీ జులై 30న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే పూజ నుండి వరుసగా మే, జూన్, జులై నెలల్లో సినిమాలు సందడి చేయనున్నాయి. చూడాలి మరి అమ్మడు ఎలా అలరిస్తుందో!