Begin typing your search above and press return to search.
సొంతూరులో రెస్టారెంట్ ప్రారంభించనున్న స్టార్ హీరోయిన్!
By: Tupaki Desk | 24 Feb 2021 10:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడే ఆమె స్వభావం అందరికి గుర్తే. తనకు ఏమనిపించినా నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేయగల కంగనా త్వరలో ఓ కొత్త వ్యాపారంలో అడుగుపెట్టనుంది. దాదాపుగా పదిహేను సంవత్సరాలనుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న కంగనా.. ఇన్నేళ్ల కెరీర్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె బాహటంగా మాట్లాడే స్వభావంతోనే బాలీవుడ్ ప్రేక్షకులలో అంతటి క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా కంగనా ఫుడ్ అండ్ బావరేజ్ బిజినెస్ లో తన ప్రతిభ చాటుకోడానికి సిద్దమైంది. తన స్వస్థలమైన మనాలిలో కంగనా ఓ విలాసవంతమైన రెస్టారెంట్ ఓపెన్ చేయనున్నట్లు తెలిపింది.
కొత్తగా ప్రారంభించినున్న తన కేఫ్, రెస్టారెంట్ దగ్గర దిగిన ఫోటోలను అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం కంగనా రెస్టారెంట్ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కంగనా సోదరి రంగోలి చందేల్ తో పాటు తన బృందంతో కొత్త రెస్టారెంట్ రిబ్బన్ కట్ చేయడానికి ఎదురుచూస్తుందట. "నా కొత్త వెంచర్ కలని మీ అందరితో పంచుకోవడం, సినిమాలు కాకుండా ఇతర అభిరుచులను, ఫుడ్ అండ్ బావరేజ్ పరిశ్రమలోకి అడుగుపెట్టడం, మనాలిలో నా మొదటి కేఫ్, రెస్టారెంట్‌ను నిర్మించడం.. ఇలా నేను కలలు నిజం చేయడానికి సహకరించిన నా బృందానికి ధన్యవాదములు" అంటూ తన టీమ్ కు థాంక్స్ తెలిపింది. ఇదేగాక కంగనా వేరోమోడా అనే క్లోత్స్ బ్రాండ్ లో కూడా పార్టనర్ షిప్ కలిగి ఉందట.
ఆమె పార్టనర్ షిప్ విలువ సుమారు 13మిలియన్స్ అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కంగనా చేతిలో యాక్షన్ థ్రిల్లర్ దాకడ్ విడుదలకు రెడీ అవుతోంది. అలాగే తలైవి బయోపిక్ కూడా సిద్ధమవుతోంది. మొత్తానికి ఈ ఏడాది కంగనా నుండి మల్టీ మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి.