Begin typing your search above and press return to search.
బ్రదర్ తో స్టార్ హీరోయిన్ స్వీట్ సెల్ఫీస్..!
By: Tupaki Desk | 4 Jun 2021 11:00 PM ISTస్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సూపర్ అనే సినిమాతో చిత్రపరిశ్రమలో అరంగేట్రం చేసి అతి తక్కువ కాలంలోనే మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారింది. అదేవిధంగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. దాదాపుగా తెలుగు, తమిళ బాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించిన అనుష్క. తాను నటించిన హీరోలతో పాటు తాను కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అరుంధతి, బాహుబలి లాంటి గొప్ప సినిమాలతో తన పేరు దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది.
అయితే బాహుబలి - భాగమతి మూవీస్ తర్వాత భారీ విరామం తీసుకొని 'నిశ్శబ్దం' అనే పాన్ ఇండియన్ మూవీతో మళ్ళీ తెరమీద కనిపించింది. అయితే గతేడాది నిశ్శబ్దం సినిమాతో అనుష్క సినీ ప్రయాణం 15ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో స్వీటీ తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతోంది. తాజాగా తన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. నేడు తన బ్రదర్ పుట్టినరోజు సందర్భంగా అన్నయ్యతో కలిసి సెల్ఫీ తీసుకున్న ఫోటోలను అనుష్క తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ అన్నచెల్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలలో అనుష్క తన అన్నతో డిఫరెంట్ స్టైల్స్ లో సెల్ఫీలు దిగింది. అలాగే ఇంతవరకు చూడని స్వీటీ చిలిపితనం ఆ ఫోటో ఎక్సప్రెషన్స్ లో కనిపిస్తుంది. తన అన్నయ్యను ఉద్దేశించి 'నువ్ నా బెస్ట్ బ్రదర్' అంటూ కాప్షన్ జోడించింది. ఇదిలా ఉండగా.. అనుష్క ప్రస్తుతం మహేష్ అనే దర్శకుడితో తదుపరి సినిమా చేయనుంది. ఇటీవలే స్టోరీ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఓ మెచూర్డ్ లవ్ స్టోరీ చూపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం అనుష్క మేకోవర్ అవుతున్నట్లు సమాచారం. చూడాలి మరి త్వరలో ఓ మంచి సినిమాతో ఫామ్ లోకి వస్తుందేమో!