Begin typing your search above and press return to search.

'యే సాల కప్ నందే' అంటున్న స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   29 April 2021 11:31 AM GMT
యే సాల కప్ నందే అంటున్న స్టార్ హీరోయిన్..!
X
సౌత్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన.. ఇప్పుడు చేతినిండా భారీ సినిమాలతో బిజీగా ఉంది. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ హిందీ సినిమాలలో అమ్మడు నాన్ స్టాప్ సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది సుల్తాన్ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసిన రష్మిక త్వరలోనే 'మిషన్ మజ్ను' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అలాగే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తూ ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో అమ్మడు సినీప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. అంటే మొత్తానికి రష్మిక ఈ ఏడాది పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే హిందీలో రెండు సినిమాలు లైన్ లో పెట్టింది.

ఇదిలా ఉండగా.. అమ్మడికి సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ కలిగి ఉందనే సంగతి తెలిసిందే. అందుకే అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటిస్తుంది. అంటే నిజానికి రష్మిక లైవ్ లోకి అరుదుగా వస్తుంది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోయి ఖాళీగా ఉండటంతో ఈ విధంగా అభిమానులను పలకరిస్తుంది. తాజాగా లైవ్ లో అమ్మడు పలు ఇంటరెస్టింగ్ విషయాలు బయటపెట్టింది. అందులో భాగంగానే తన ఫేవరేట్ ఐపీఎల్ టీమ్(యే సాల కప్ నందే) అంటూ విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్న బెంగుళూరు ఛాలెంజర్స్ అని చెప్పేసింది. ఈ మాట చెప్పగానే ఆర్సిబి ఫ్యాన్స్ రష్మిక మా పార్టీనే అంటూ మురిసిపోతున్నారు. అలాగే విజయ్ దేవరకొండతో మరో సినిమా ఎప్పుడంటే.. సరైన స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది అమ్మడు. ప్రస్తుతం రష్మిక వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.