Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ సమంత బర్త్ డే సీడీపీ విడుదల!
By: Tupaki Desk | 27 April 2021 4:30 PMసాధారణంగా ఫేవరేట్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఫోటో లేదా వీడియో పోస్ట్ పెడితేనే పొంగిపోయే ఫ్యాన్స్.. అదే ఫేవరేట్ హీరోయిన్ పుట్టినరోజు వచ్చిందంటే మాత్రం ఆ హుషారు వేరే లెవెల్లో ఉంటుంది. ఇవి నార్మల్ డేస్ అయితే వేరేలా ఉండేది కానీ ఇప్పుడు కరోనా టైం కాబట్టి మనస్ఫూర్తిగా అభిమానులు తమ అభిమాన తారల స్పెషల్ డేస్ సెలెబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికి తెలిసిందే. అందం చందంతో పాటు అభినయంలో కూడా మేటి అనిపించుకుంది సామ్. అందుకే ఇప్పటికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. కెరీర్ ప్రారంభించి పదేళ్ళైనా నేటికీ అదే అణుకువతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఏప్రిల్ 28న సమంత తన 34వ పుట్టినరోజు జరుపుకోనుంది. అంటే రేపే సామ్ బర్త్ డే సందడి సోషల్ మీడియాలో హల్చల్ చేయనుంది.
ఇప్పటికే అడ్వాన్స్ శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అయితే 'ఏ మాయచేసావే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సామ్.. అదే సినిమా హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి ఏకంగా పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో సామ్ - చైతూ కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. సామ్ పుట్టినరోజు సందర్బంగా తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ రిలీజ్ చేసింది. సౌత్ క్వీన్ అంటూ అదే అర్ధం వచ్చేలా సీడీపీని క్రియేట్ చేశారు. అలాగే సౌత్ రాజ్యానికి సామ్ ను క్వీన్ లా చూపిస్తూనే సీడీపీలో ఆమె నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలు(pratyusha, ekam) మెన్షన్ చేశారు. అదే విధంగా కరోనా సమయంలో మాస్క్ ధరించి ఆరోగ్యంగా ఉండాలంటూ ట్యాగ్స్ తో అవగాహన కల్పించేలా ప్రయత్నం చేయడం మెచ్చుకోవాలి. ప్రస్తుతం సమంత సీడీపీ సోషల్ మీడియాలో, సినీవర్గాలలో హల్చల్ చేస్తోంది. అలాగే సామ్ ఇప్పుడు కాతువకుల రెండు కాదల్, శకుంతలం సినిమాలు చేస్తోంది.