Begin typing your search above and press return to search.

న్యూయార్క్‌లో స్టార్ హీరోయిన్ రెస్టారెంట్

By:  Tupaki Desk   |   28 Jun 2021 9:30 AM GMT
న్యూయార్క్‌లో స్టార్ హీరోయిన్ రెస్టారెంట్
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన తొలి టీవీ షో క్వాంటికో త‌ర్వాత హాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జాయింట్ వెంచ‌ర్ లో వెబ్ సిరీస్ లు సినిమాల నిర్మాణంతో పాటు ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌ల‌తో పీసీ బిజీగా ఉంది. అమెరికన్ పాప్ స్టార్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకుని యుఎస్ లో ఖరీదైన బంగ్లా కొన్న తరువాత ప్రియాంక ఇప్పుడు న్యూయార్క్ నగరంలో సోనా అనే సొంత రెస్టారెంట్ ను ప్రారంభించింది.

ప్రియాంక ఇన్ స్టాగ్రామ్ లో తన రెస్టారెంట్ కి సంబంధించిన‌ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 3 సంవత్సరాల ప్రణాళిక తర్వాత సోనా రెస్టారెంట్ ని ప్రారంభించాం.. ప్రేమ‌తో దీనికోసం శ్రమించాము.. అని పేర్కొంది. రెస్టారెంట్ లో మిమి అనే ప్రైవేట్ భోజనాల గది పీసీ కోసం ఉంది.

రెస్టారెంట్ ఇంటీరియర్‌ ను భారతీయ కళాకారులు రూపొందించారు. తన స్నేహితులతో కలిసి పీసీ ఇండియ‌న్ స్టైల్ చిరుతిండి పానిపురిని ఆస్వాధిస్తున్న ఫోటోను పీసీ షేర్ చేసింది. బాలీవుడ్ లోనే ప్రామిస్సింగ్ ఎంట‌ర్ ప్రెన్యూర్ గా పీసీ దూసుకుపోతోంద‌నే చెప్పాలి.