Begin typing your search above and press return to search.

వయ్యారంగా 'కిక్ బాక్సింగ్' ప్రాక్టీస్ చేస్తున్న స్టార్ హీరోయిన్!

By:  Tupaki Desk   |   15 March 2021 8:50 AM GMT
వయ్యారంగా కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్టార్ హీరోయిన్!
X
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వయ్యారి ఎంత నాజూకుగా తన శారీరక సౌష్టవాన్ని కాపాడుకుంటుందో అందరికి తెలిసిందే. రకుల్ అంటేనే ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్ళైనా రకుల్ మొదట్లో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా తన సోయగాన్ని అలాగే మెయింటైన్ చేస్తోంది. రకుల్ సినిమాలు ఉన్నా లేకపోయినా.. షూటింగ్స్ ఉన్నా లేకపోయినా వర్కౌట్స్ చేయడం మాత్రం అసలు ఆపదు. అలాగే ఫిట్నెస్ సంబంధించిన వ్యాయామాలు, ఆసనాలు డాన్స్ ఏదైనా నాన్ స్టాప్ చేస్తూనే ఉంటుంది. అలా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎన్నో లక్షలమంది ఫ్యాన్స్ అండ్ ఫాలోయర్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

ఎప్పటికప్పుడు రకుల్ తన ఫిట్నెస్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ప్రేక్షకులతో పంచుకుంటుంది. సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో ఈ అమ్మడికి బాగా తెలుసు. అందుకే తాజాగా ఓ వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తన ఫిట్నెస్ ట్రైనర్ తో కలిసి రకుల్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. చేతులతో పంచింగ్ చేస్తూ.. కాళ్ళతో కిక్ చేయడం మనం చూడవచ్చు. నిజానికి రకుల్ సినిమాల్లోకంటే వర్కౌట్ వీడియోలలో మరింత అందంగా కనిపిస్తుందని టాక్ నడుస్తుంది. ఎందుకంటే వర్కౌట్ వీడియోల్లో మేకప్ ఉండదు కదా. ప్రస్తుతం అమ్మడి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. రకుల్ ఇటీవలే తెలుగులో ఓ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కంప్లీట్ చేసింది. అలాగే ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.