Begin typing your search above and press return to search.
పవన్ మూవీలో హీరోయిన్ అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయిగా...!
By: Tupaki Desk | 9 Sept 2020 1:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సురేందర్ రెడ్డి సినిమా గురించి అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. వక్కంతం వంశీ ఓ పవర్ ఫుల్ స్టోరీ అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయం ఉన్నప్పటికీ పవన్ - సూరి కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టే హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.
కాగా పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని అనుకుంటున్నారట. గతంలో పవన్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. మరి పవర్ స్టార్ - స్టైలిష్ డైరెక్టర్ కాంబోలో చందమామ కాజల్ నటిస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా.. హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ కంప్లీట్ అయిన తర్వాత సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ అవనుంది. ఆ లోపు సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి కూడా పెట్టుబడి పెట్టనున్నాడు.