Begin typing your search above and press return to search.

అటవీశాఖ అధికారిగా స్టార్ హీరోయిన్ మూవీ.. ఓటిటి రిలీజుకు సిద్ధం!

By:  Tupaki Desk   |   7 Jun 2021 3:00 PM IST
అటవీశాఖ అధికారిగా స్టార్ హీరోయిన్ మూవీ.. ఓటిటి రిలీజుకు సిద్ధం!
X
బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ అండ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగుతుంది విద్యాబాలన్. మ్యారేజ్ ముందు గ్లామర్ పాత్రలతో మెరిసిన విద్యా.. మ్యారేజ్ తర్వాత పూర్తిగా గ్లామర్ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. కేవలం నటనకు ఆస్కారం ఉన్నటువంటి పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళ్తుంది. అలాగని కేవలం బాలీవుడ్ వరకే పరిమితం కాలేదు. ఏ ఇండస్ట్రీ నుండి ఆఫర్ వచ్చినా కాదనకుండా నటిస్తూ.. తనని తాను ప్రూవ్ చేసుకుంటుంది. తనకు పాత్ర నచ్చితే ఎలాంటి మొహమాటం లేకుండా ఓకే చేస్తోంది. కానీ వీలైనంత వరకు ఎక్సపరిమెంటల్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తోంది.

అయితే విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన సమయంలో కంటే ఇప్పుడే ఎక్కువగా పారితోషికం అందుకుంటుందట. ప్రస్తుతం విద్యాబాలన్ ప్రధాన పాత్రలో షేర్ని అనే సినిమా చేసింది. ఈ సినిమాలో విద్యా ఇంతవరకు కనిపించని పాత్రలో కనిపించనుంది. ఏంటంటే.. ఈ సినిమాలో ఆమె ఒక ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అడవుల సంక్షేమానికి, అడవి మృగాలకు మనుషుల జీవన విధానాలకు సంబంధించిన నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవలే సినిమా ట్రైలర్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం షేర్ని ట్రైలర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ప్రేక్షకులలో అంచనాలు పెంచుతోంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం థియేటర్స్ మూతపడి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కావడం లేదు. విడుదలకు ఆలస్యం అవుతుంది అనుకునే వారంతా తమ సినిమాలని ఓటిటి వేదికగా డిజిటల్ రిలీజ్ చేసుకుంటున్నారు. తాజాగా విద్యాబాలన్ నటించిన షేర్ని మూవీ కూడా జూన్ 18న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. అమిత్ మసుర్కర్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో షర్మన్ జోషి, మృనాల్ ఠాకూర్ లు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను టి-సిరీస్ మరియు అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ విన్నప్పటి నుండే సినిమా పై నమ్మకం ఉందని ఇటీవలే విద్యా తెలిపింది. మరి విద్యా నమ్మకాన్ని సినిమా నిలబెడుతుందేమో చూడాలి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది.