Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ లేటెస్ట్ మూవీ ఓటిటి స్ట్రీమింగ్..!
By: Tupaki Desk | 14 April 2021 8:00 PM ISTఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజుకు నోచుకోని సినిమాలను ఎలాంటి ఆలస్యం చేయకుండా డిజిటల్ రిలీజ్ చేసేస్తున్నారు మేకర్స్. ఎందుకంటే థియేటర్స్ అనేవి ఇప్పట్లో బడా సినిమాలకు తప్పితే చిన్నసినిమా, మీడియం సినిమాలకు తగినన్ని దొరికే అవకాశం కనిపించడం లేదు. అంతేగాక గతంలో లాగా కాకుండా ఇప్పుడు వారానికి రెండు సినిమాలకు మించి థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో థియేటర్స్ ప్రాబ్లెమ్ ఎందుకని నేరుగా డిజిటల్ రిలీజ్ బెస్ట్ అని భావిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ దారిలోనే స్టార్ హీరోయిన్ సినిమా విడుదలైంది. సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ఈ మధ్యకాలంలో మూవీస్ జోరు తగ్గించింది. ఎందుకో తెలియదు కానీ ఇదివరకటిలా వేగంగా సినిమాలు చేయడం లేదు.
తాజాగా అమ్మడు నటించిన సినిమా 'పరమపాదం విలయట్టు'. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న అంటే తమిళ ఉగాది పండుగ సందర్బంగా డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. అందుకే త్రిష కెరీర్లో ఎంతో స్పెషల్ మూవీ కాబోతుంది ఈ చిత్రం. అలాగే త్రిష నటించిన 60వ సినిమా కూడా ఇదే కావడం విశేషం. నిజానికి పరమపాదం విలయట్టు సినిమా గతేడాది విడుదల కావాల్సింది. కానీ ఏవో కారణాల వలన సినిమా ఈ ఏడాదికి వాయిదాపడింది. కానీ ఈ ఏడాది రిలీజ్ చేద్దామని అనుకుంటే కరోనా సెకండ్ వేవ్ ఓ రేంజిలో వణుకు పుట్టిస్తుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో త్రిష ఓ పవర్ ఫుల్ పొలిటిషన్ కోసం నియమించిన డాక్టర్ పాత్రలో నటించింది. అయితే ఆ పొలిటిషన్ మర్డర్ కేసులో చిక్కుకున్న డాక్టర్ ఎలా బయటపడింది అనే నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను 24హౌర్స్ బ్యానర్ నిర్మించింది.