Begin typing your search above and press return to search.

మనీలాండరింగ్ కేసులో స్టార్‌ హీరోయిన్!!

By:  Tupaki Desk   |   31 Aug 2021 3:26 PM IST
మనీలాండరింగ్ కేసులో స్టార్‌ హీరోయిన్!!
X
ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌. ఇటీవల కాలంలో ఈమె పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బాలీవుడ్‌ తో పాటు అంతటా కూడా మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకు పోతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ అనూహ్యంగా మనీలాండరింగ్ కేసులో చిక్కుకుంది. ఆమె గత కొన్నాళ్లుగా చెన్నైకు చెందిన పారిశ్రామిక వేత్తతో సహజీవనం సాగిస్తుంది. ఆమె కోసం సదరు వ్యాపార వేత్త రూ.175 కోట్లు పెట్టి ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏరియా అయిన జుహు లో సముద్రం కు ఎదురుగా ఉండేలా అత్యంత విలాసవంతంగా బంగ్లాను కొనుగోలు చేయడం జరిగింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రియుడు మనీలాండరింగ్ వ్యవహారం సాగిస్తున్నట్లుగా అనుమానాలు ఉండటంతో ఈడీ సోదాలు నిర్వహించింది. జుహులోని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించగా పలు డాక్యుమెంట్లు మరియు ఇతర విషయాలు బయట పడ్డాయి. ఎంతో మందిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుకుని చీటింగ్‌ చేయడం వరకు ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. ఆయన జైల్లో ఉండే మనీలాండరింగ్‌ ను నడిపించిన ఘనుడుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. జాక్వెలిన్ ప్రస్తుతం అతడి భాగస్వామిగా ఉన్న కారణంగా ఆ ఇంట్లో ఆమె ఉంటున్న కారణంగా ఆమెకు కూడా ఈ కేసుతో సంబంధం ఏర్పడిందని అంటున్నారు.

అయితే ఇప్పటి వరకు ఆమెను ఒక నింధితురాలిగా మాత్రం విచారించలేదని.. అతడికి సంబంధించిన వ్యవహారాల్లో ఈమె భాగస్వామ్యం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని.. ప్రత్యక్షంగా మనీలాండరింగ్‌ వ్యవహారంతో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లుగా వెళ్లడి అయితే కేసు బుక్ అవ్వడం ఖాయం అంటూ అధికారులు చెబుతున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్‌ మీడియా పలు కథనాలు ప్రచురిస్తుంది. కాని ఇప్పటి వరకు ఆమె ఏ విషయమై స్పందించలేదు. ఆమెకు సంబంధించినంత వారు మాత్రం కేసుతో సంబంధం లేదు అంటూ మీడియాకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఆమె మాత్రం బాహాటంగా స్పందించడం లేదు.