Begin typing your search above and press return to search.

దళపతి విషయంలో స్టార్ హీరోయిన్ భారీ డిమాండ్!

By:  Tupaki Desk   |   9 April 2021 9:00 AM IST
దళపతి విషయంలో స్టార్ హీరోయిన్ భారీ డిమాండ్!
X
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే.. ప్రస్తుతం కెరీర్ పీక్స్ టైం ఎంజాయ్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు పూజా చేతినిండా భారీ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇదివరకే డార్లింగ్ ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమా కంప్లీట్ చేసింది. ఆ సినిమాతో అమ్మడు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అందుకోనుంది. అలాగే అటు బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ సరసన నటించిన 'సర్కస్' మూవీలో కూడా తన క్యారెక్టర్ షూటింగ్ ముగింపు దశలో ఉందట. ఇలా ఒక్కో సినిమాను పూర్తి చేసుకుంటూ కొత్త సినిమాలను లైన్ లో పెడుతోంది. ఇటీవలే కోలీవుడ్ దళపతి విజయ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా పేరు ఖరారైంది. దళపతి 65వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అంతకుముందు కూడా పూజా పేరే వినిపించింది కానీ ఆఖరికి మేకర్స్ పూజా పేరు ప్రకటించే సరికి ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. దళపతి65 మూవీకోసం పూజాహెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో దళపతి సరసన నటించేందుకు పూజ ఏకంగా 3 కోట్లు పారితోషికంగా తీసుకోబోతుందని సినీవర్గాలలో టాక్. కానీ దళపతి విజయ్ సినిమా కాబట్టి ఆ రేంజిలో పారితోషికం తీసుకోవడం సబాబే అంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ పూజకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రేంజిలో పారితోషికం ఆశించడం మాములే అంటున్నారు. ఇదివరకు 3కోట్లు తీసుకున్న హీరోయిన్స్ లో నయనతార, సమంత ఉన్నారు. ఇప్పుడు అదే లిస్టులో పూజా చేరనుంది. యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నారు.