Begin typing your search above and press return to search.
'బ్రాండ్ వాల్యుయేషన్'లో స్టార్ హీరోయిన్.. 450.4 మిలియన్లతో..!
By: Tupaki Desk | 12 Feb 2021 9:00 AM ISTఇండియన్ సెలబ్రిటీలు ప్రతి ఏడాది పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో, ఫోర్బ్స్ లాంటి టాప్ సెలబ్రిటీ పత్రికలలో మెరుస్తుంటారు. అందులో సినిమా ఇండస్ట్రీ తరపున అయితే ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు కనిపిస్తుంటారు. అయితే తాజాగా న్యూయార్క్ నగరానికి చెందిన మల్టీనేషనల్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సంస్థ డఫ్ & ఫెల్ప్స్ తన ఏడవ ఎడిషన్ సెలెబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ 2021 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అత్యంత విలువైన మహిళా సెలబ్రిటీగా స్థానములో నిలిచిందని తాజా నివేదికలో వెళ్లడయింది. అయితే ఈ బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీ సెలబ్రిటీల ఆమోద ఒప్పందాల నుండి పొందిన బ్రాండ్ విలువల ఆధారంగా రూపొందిస్తారు. డఫ్ అండ్ ఫెల్ప్స్ సంస్థ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ప్రముఖ బ్రాండ్ల ర్యాంకింగ్‌ను అందిస్తుంది. బ్రాండ్ వాల్యూ ర్యాంకింగ్స్, సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్ రెండింటి పై మహమ్మారి ప్రభావాన్ని పరిశీలిస్తుందని వెబ్‌సైట్ చెబుతోంది.
అయితే ఈ సందర్బంగా తెలిపిన బ్రాండ్ వాల్యుయేషన్ ప్రకారం.. దీపికా పదుకొనే బ్రాండ్ విలువ 450.4/మిలియన్లతో ఎంతోమంది మేల్ సెలబ్రిటీలను అధిగమించింది. డఫ్ అండ్ ఫెల్ప్స్ అధ్యయనంలో దీపిక తర్వాత స్థానాలలో అలియా భట్, అనుష్క శర్మ, కరీనా కపూర్ ఉన్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే.. 237.7 మిలియన్స్ బ్రాండ్ వాల్యుయేషన్ తో క్రికెటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్ లు నిలిచారు. ఇదిలా ఉండగా.. హీరోయిన్ దీపికా పదుకొనే చివరిగా తన హోమ్ ప్రొడక్షన్ ఛపాక్ మూవీలో కనిపించింది. ఇక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రెసెంట్ దీపిక.. స్పోర్ట్స్ డ్రామా 83, శకున్ బాత్రా దర్శకత్వంలో ఓ సినిమా, హృతిక్ రోషన్ తో ఫైటర్, షారుఖ్ ఖాన్ తో పఠాన్, హాలీవుడ్ హిట్ ది ఇంటర్న్ రీమేక్ లతో పాటు ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీలో చేస్తోంది. వీటితో పాటు మహాభారతం నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూనే ద్రౌపది పాత్రను పోషిస్తుంది. మొత్తానికి దీపిక ఈ రెండేళ్లు ఖాళీలేదని చెప్పకనే చెబుతోంది.