Begin typing your search above and press return to search.
'పానీ పానీ' అంటూ మేకింగ్ వీడియోతో స్టార్ హీరోయిన్ హల్చల్..!
By: Tupaki Desk | 11 Jun 2021 2:00 PM ISTశ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన హవా కంటిన్యూ చేస్తోంది. ఎల్లప్పుడూ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే జాక్వెలిన్ తాజాగా మరో ప్రైవేట్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఏ భారతీయ సంప్రదాయ దుస్తులలో అయినా తన మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు సినీ కెరీర్ పరంగా అమ్మడు మొత్తం ఇండియన్ కాస్ట్యూమ్స్ ఎక్కువగా ధరించినట్లు తెలుస్తుంది. ఇదివరకు రాపర్ పాప్ సింగర్ బాద్షాతో కలిసి జాక్వెలిన్ 'గెండా పూల్' సాంగ్ లో అందరి మనసులు గెలుచుకుంది. ఆ పాటలో బెంగాలీ వస్త్రాధారణను మనం చూడవచ్చు.
అయితే తాజాగా బాద్షాతో కలిసి 'పానీ పానీ' అనే సరికొత్త పాటతో ముందుకు వచ్చింది. గెండాపూల్ కోసం బెంగాలీ అవతారంలో కనిపించిన జాక్వెలిన్.. ఈసారి పానీపానీ పాటలో రెడ్ అండ్ వైట్ సారీతో పాటు ఆభరణాలు అందమైన మేకప్‌తో సంప్రదాయ రాజస్థాని రూపంలో అలరిస్తుంది. బాద్షా - ఆస్తా గిల్ కలిసి పాడిన ఈ రాజస్థాని స్టైల్ సాంగ్ ఇటువలే రిలీజ్ అయింది. ఈ పెప్పి ట్రాక్ మ్యూజిక్ వీడియోను రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో షూట్ చేశారు. అయితే ఈ సాంగ్ లిరిక్స్ తో పాటు మ్యూజిక్ కూడా బాద్షానే ఇవ్వడం విశేషం. తాజాగా జాక్వెలిన్ ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ.. "బాద్షా పానీపానీ సాంగ్ విషయంలో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వెంటనే ఓకే చెప్పను. ఎందుకంటే ట్రాక్ వింటే ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతుందని అనిపించింది. ఈ పాటలో మీరు డిఫరెంట్ జాక్వెలిన్ అవతారం చూస్తారు. అద్భుతమైన ఎడారి.. ప్రకృతి అందాల మధ్య ఈ సాంగ్ షూట్ చేసాం." అని చెప్పుకొచ్చింది.
అయితే తాజాగా జాక్వెలిన్ తన ఇంస్టా ఖాతాలో పానీపానీ సాంగ్ మేకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మనం డిఫరెంట్ రాజస్థాని గెటప్స్ లో జాక్ బ్యూటీని చూడవచ్చు. ఈ ముప్పైఐదేళ్లు పైబడిన గ్లామరస్ బ్యూటీ పానీ పానీ అంటూ అందరి మనసులు దోచుకుంటుంది. ఆ వీడియోలో జాక్ ఉత్సాహం మాములుగా లేదు. కేవలం రెండు రోజుల్లో ఈ సాంగ్ షూట్ పూర్తి చేసినట్లు అమ్మడు తెలిపింది. తాజాగా సోషల్ మీడియాలో జాక్వెలిన్ టాప్ టు బాటమ్ స్టైలిష్ బ్లూ డ్రెస్ ధరించిన పిక్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సొగసరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేయబోతుంది.