Begin typing your search above and press return to search.

యూర‌ప్ లో స్టార్ హీరోయిన్ హంగామా

By:  Tupaki Desk   |   21 Jan 2022 7:08 AM GMT
యూర‌ప్ లో స్టార్ హీరోయిన్ హంగామా
X
స్టార్ హీరోయిన్ సమంత గ‌త ఏడాది అక్టోబ‌ర్ నుంచి కొంత విప‌త్క ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అక్టోబ‌ర్ 2న హీరో నాగ‌చైత‌న్య‌తో తాను విడిపోతున్నాన‌ని ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి అమెపై నెట్టింట భారీ స్థాయిలో ట్రోలింగ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి కొంత మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతూ వ‌చ్చిన సామ్ దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం త‌న స్నేహితురాలు శిల్పారెడ్డితో క‌లిసి రిషీకేష్ కు ప్ర‌త్యేకంగా వెళ్లిన విష‌యం తెలిసిందే.

యాత్ర త‌రువాత రీఫ్రెష్ అయిన స‌మంత .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌`లో `ఊ అంట‌వా మావ‌.. ఊహూ.. అంట‌వా.. ` అంటూ తొలి సారి ప్ర‌త్యేక గీతంలో న‌టించి పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పాట ఇప్పుడు వైర‌ల్ కావ‌డంతో అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల‌కు ఫేవ‌రేట్ హీరోయిన్ గా మారిపోయింది. డైవ‌ర్స్ కార‌ణంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారి ట్రోలింగ్ కు గురైన సామ్ ఈ పాట‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా హాట్ ఫేవ‌రేట్ గా నిలిచింది.

`పుష్ప‌` స‌క్సెస్ తో ఒక్క‌సారిగా స‌మంత ఫేట్ మారిపోయింది. ఈ సినిమా కార‌ణంగా సామ్ కు బాలీవుడ్ బ‌డా ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు భారీ ఆఫ‌ర్ లు ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికే లేడీ ఓరియెంటెడ్ మూవీ `య‌శోద‌`లో న‌టిస్తున్న స‌మంత‌కు బాలీవుడ్ క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీ య‌ష్ రాజ్ ఫిలింస్ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంద‌ని, స‌మంత‌తో మొత్తం మూడు చిత్రాల కోసం అగ్రిమెంట్ చేసుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఒక్క‌సారిగా `పుష్ప‌` ఐట‌మ్ సాంగ్ తో త‌న కెరీర్ మారిపోవ‌డంతో ఈ ఆనంద క్ష‌నాల‌ని సామ్ ఆస్వాదిస్తోంది.

చాలా రోజుల త‌రువాత త‌న చుట్టూ పాజిటివిటీ పెర‌గ‌డంతో యూర‌ప్ కు వెకేష‌న్ కి వెళ్లింది. అక్క‌డి నుంచి స్విట్జ‌ర్లాండ్ వెళ్లిన సామ్ అక్క‌డి అందాల మ‌ధ్య విహ‌రిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆ ఎల్లో క‌ల‌ర్ జ‌ర్కీ, క‌ళ్ల‌కు స్మో గాగుల్స్ ధ‌రించి క‌నిపిస్తున్న ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుంది. ఈ ఫొటోకి `4వ రోజు ఆ మేజిక్ జరుగుతుంది` అని క్యాప్ష‌న్ ఇచ్చింది. అయితే దీనికి గాయ‌ని, స‌మంత స్నేహితురాలు చిన్మ‌యి ఆస‌క్తిక‌రంగా స్పందించింది.

`నువ్వొక హైప‌ర్ అచీవ‌ర్ వి. నువ్వు ఏ కాంపిటీష‌న్ లో పాల్గొన్నాగోల్డ్ మెడ‌ల్ సాధించే వ‌స్తావు` అంటూ ల‌వ్ ఓమోజిని జ‌త చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట సంద‌డి చేస్తోంది. ఇక సామ్ యూర‌ప్ టూర్ పై కామెంట్ లు కూడా వినిపిస్తున్నాయి. కోవిడ్ కార‌ణంగా యావ‌త్ ప్ర‌పంచం ఇబ్బందులు ప‌డుతుంటే సామ్ మాత్రం విహార యాత్ర‌ల‌తో ఎంజాయ్ చేస్తోంద‌ని కామెంట్ చేస్తున్నారు.