Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ డాట‌ర్ బికినీ ట్రీట్ కి మెంట‌లే

By:  Tupaki Desk   |   29 Nov 2020 7:30 PM IST
స్టార్ హీరోయిన్ డాట‌ర్ బికినీ ట్రీట్ కి మెంట‌లే
X
నేటి త‌రం ప్ర‌తిదీ ఎంతో వైబ్రేంట్ గా ఉండాల‌ని కోరుకుంటోంది. బ‌ర్త్ డేలు.. యానివ‌ర్శ‌రీలు ప్ర‌తిదీ ఎంతో గొప్ప‌గా ఉండాల‌న్న ప్రిప‌రేషన్ క‌నిపిస్తోంది. ఇదిగో ఇక్క‌డ మేటి న‌టి పూజా భేడీ వారసురాలు ఆల‌య ఎఫ్ కూడా అందుకు మిన‌హాయింపేమీ కాదు.

బాలీవుడ్ లో ఈ న‌ట‌వార‌సురాలి ఆరంగేట్రం గ‌త ఏడాది జ‌రిగింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌వుతోంది ఈ డెబ్యూ బ్యూటీ. తాజాగా త‌న పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్ ని బికినీ బీచ్ ప‌రిస‌రాల్లో సంథింగ్ స్పెష‌ల్ గా ప్లాన్ చేసి హాట్ టాపిక్ గా మారింది ఆల‌య‌.

ముంబై సముద్రతీరంలోని అలీబాగ్ లో జరిగిన తన పుట్టినరోజు పార్టీ కోసం ఆల‌య‌ హాట్ బికినీ ధరించింది. ఆమె తన స్నేహితులతో కలిసి సెల‌బ్రేట్ చేసింది. A అండ్ F అనే అక్షరాలతో లైటింగ్ ఎఫెక్ట్ లో ఆల‌య బికినీ త‌ళ‌త‌ళా మెరిసిపోతోంది. ఆ పువ్వులు బెలూన్లు హంగామా మామూలుగా లేదు.

అలయ ఎఫ్ మామ్ పూజా లానే డేరింగ్ గాళ్. ధైర్యంగా .. అందమైన వ్యక్తిత్వం గ‌ల మోడ్ర‌న్ యువ‌తిగా ఫేజ్ 3 క్రౌడ్ లో పాపుల‌ర‌వుతోంది. కుమార్తె కూడా తల్లిలాగే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అన్న ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటోంది. ఆలయా ఇన్ స్టా ఆద్యంతం వేడెక్కించే ఫోటోషూట్లు వీడియోల‌తో చెల‌రేగిపోయింది ఈ కుర్ర‌బ్యూటీ.