Begin typing your search above and press return to search.
స్టార్ హీరోయిన్ కాలేజ్ డేస్ చేదు అనుభవాలు
By: Tupaki Desk | 14 July 2021 6:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాబితాలో కరీనా కపూర్ ఖాన్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈమె తండ్రి.. సోదరి సినిమా పరిశ్రమకు చెందిన వారే అవ్వడంతో పాటు కపూర్ ఫ్యామిలీ మొత్తం కూడా బాలీవుడ్ ను ఏలేస్తున్న నేపథ్యంలో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభం నుండే ఈమెకు లక్ బాగుండి మంచి సినిమాలు పడ్డాయి. తద్వార తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఇండస్ట్రీలో ఈమె నటించిన నటిస్తున్న సినిమాలు ఇప్పటికి మంచి క్రేజ్ ను కలిగి ఉంటాయి. పెళ్లి చేసుకుని చాలా ఏళ్లు అయ్యింది.. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా కరీనా కపూర్ ఇప్పటికి హీరోయిన్ గా బిజీగా నే ఉంది అంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు విదేశాలకు ప్రత్యేక విమానంలో వెళ్లగలిగేంతటి ఆస్తులు ఉన్న ఈమె చదువుకునే రోజుల్లో కాలేజ్ కు మాత్రం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిందట. తండ్రి రణ్ దీర్ కపూర్ అప్పటికే గుర్తింపు ఉన్న సెలబ్రెటీ అయినా కూడా ఆర్థికంగా ఆయన బాగానే ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆర్టీసీ ప్రయాణాలు చేయడంతో పాటు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని పలు సందర్బాల్లో కరీనా తో పాటు ఆమె అక్క కరిష్మ చెప్పుకొచ్చింది. కరిష్మ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న సమయంలో కూడా కరీనా కపూర్ కాలేజ్ కు బస్సులు లేదా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వెళ్లేదట. వందల కోట్ల ఆస్తులు ఇప్పుడు ఉన్న కరీనా కపూర్ ఖాన్ ఒకప్పుడు మాత్రం పాకెట్ మనీ కోసం కూడా ఇబ్బంది పడ్డ సందర్బాలు చాలా ఉన్నాయట.
కరిష్మ కపూర్ ను హీరోయిన్ గా చేయాలని తల్లి బబిత భావించగా అందుకు రణ్ దీర్ ఒప్పుకోలేదట. దాంతో ఆయన నుండి దూరంగా వచ్చేసిన బబిత తన ఇద్దరు కూతుర్ల బాధ్యతను తీసుకుని వారిని ప్రయోజకులను చేశారు. ఆ సమయంలోనే వారు ముగ్గురు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెబుతూ ఉంటారు. కరిష్మ హీరోయిన్ గా బిజీ అయిన తర్వాత ఎప్పుడు కూడా వెను దిరిగి చూసుకోలేదు. కమర్షియల్ గా ఎప్పుడు ఇబ్బందులు ఎదురు కాలేదట. కరీనా కపూర్ కు ఆ కొంత కాలం మాత్రం జీవితాంతం గుర్తుండి పోయే జ్ఞాపకాలను మిగిల్చిందట. ఎప్పటికి తన కాలేజ్ డేస్ ను మర్చి పోలేను అని.. సెలబ్రెటీ అనే కాని కనీస ఆర్థిక పరమైన విషయాల్లో కూడా స్వేచ్చ ఉండేది కాదని కరీనా అప్పట్లో బాధపడేదట. కాని ఇప్పుడు మాత్రం ఆమె వేల కోట్ల సంపదకు వారసులు అయిన సైఫ్ అలీ ఖాన్ భార్య.
అలాగే బాలీవుడ్ లో పదుల కోట్ల పారితోషికం తీసుకునే టాప్ హీరోయిన్. అందుకే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని కరీనా కాలేజ్ డేస్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ లో ఈ అమ్మడి సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. వయసు పెరుగుతున్నా కూడా పారితోషికం మాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉంది. ఈ వయసులో కూడా ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఈమెను హీరోయిన్ గా తమ సినిమాల్లో పెట్టుకునేందుకు స్టార్ హీరోలు సిద్దంగా ఉన్నారు. తన అక్క కంటే ఎక్కువ కాలం స్టార్ హీరోయిన్ గా ఈమె నిలిచింది. ముందు ముందు కూడా ఈమె స్టార్ గానే కంటిన్యూ అవుతుందని అభిమానులు అంటూ ఉంటారు.