Begin typing your search above and press return to search.

చెల్లి డెబ్యూ కోసం స్టార్ హీరోయిన్ ప్రయత్నాలు!

By:  Tupaki Desk   |   21 Jun 2021 4:30 PM GMT
చెల్లి డెబ్యూ కోసం స్టార్ హీరోయిన్ ప్రయత్నాలు!
X
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే యాక్టర్స్ గా మారే ఎవరికైనా అవకాశం ఇస్తుంది. అలా యాక్టింగ్ పరంగా తమ సత్తా చాటుకొని పాపులర్ అయిపోవచ్చు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒకరు సెటిల్ అయిపోయాక వారి ఫ్యామిలీ నుండి మరొకరిని తీసుకురావడం అనేది మాములే అయిపోయింది. ఇది మొదటి నుండి కొనసాగుతున్న విషయమే. ఎందుకంటే హీరోగా కానీ హీరోయిన్ గా కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారంటే ఖచ్చితంగా వారి సిస్టర్స్ బ్రదర్స్ ని కూడా ఎలాగైనా సెట్ చేయాలనీ చూస్తుంటారు. ఒకదశలో వారిని ఇంట్రడ్యూస్ చేసేందుకు హీరోహీరోయిన్స్ రంగంలోకి దిగుతుంటారు.

ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేస్తోందట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించింది తెలుగులోనే అయినప్పటికీ స్టార్డం అందుకుంది మాత్రం బాలీవుడ్ లోనే. అందుకే ప్రస్తుతం బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో మోస్ట్ బిజీస్ట్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఈ భామకు నుపూర్ సనన్ అనే ఓ అందమైన చెల్లి ఉంది. ఆమెకు కూడా సినిమా ఇండస్ట్రీ పై ఎంతో మక్కువ ఉండటంతో మొదటగా యూట్యూబ్ సింగర్ గా పాపులర్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ లో ఆల్బమ్స్ పాడి సూపర్ క్రేజ్ దక్కించుకొని ఏకంగా బాలీవుడ్ సినిమాలలో కూడా పాడే అవకాశం అందుకుంది.

అయితే ప్రస్తుతం నుపూర్ లక్ష్యం సింగింగ్ మాత్రమే కాదట. తనకు కూడా యాక్టింగ్ పై మక్కువ ఉండటంతో మంచి హీరోయిన్ ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. అలాగే రెగ్యులర్ గా యాక్టర్ స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవుతుందట. అయితే త్వరలోనే నుపూర్ బాలీవుడ్ డెబ్యూ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ హీరోయిన్ కృతిసనన్ మాత్రం తన చెల్లిని మొదటగా టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే కృతి కూడా తెలుగులోనే అడుగు పెట్టి తర్వాత హిందీలో స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇదే సీన్ నుపూర్ విషయంలో కూడా రిపీట్ అవుతుందనే ఆశతో ప్లాన్ చేస్తోందని టాక్. చూడాలి మరి నిజంగానే తెలుగు డెబ్యూ చేయిస్తుందా లేదా అనేది.