Begin typing your search above and press return to search.

'బిగ్ బాస్ - 4' హోస్ట్ గా స్టార్ హీరోయిన్...?

By:  Tupaki Desk   |   26 Jun 2020 5:45 AM GMT
బిగ్ బాస్ - 4 హోస్ట్ గా స్టార్ హీరోయిన్...?
X
ఇండియాలో సూపర్ సక్సెస్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో లలో 'బిగ్ బాస్' కూడా ఒకటి. ఎన్నో వివాదాల నడుమ తెలుగులో ప్రసారం అయిన ఈ షోకు ఫస్ట్ సీజన్‌ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై ఎన్నో విమర్శలు కూడా చెలరేగాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న 'బిగ్ బాస్' ఇప్పుడు సీజన్ 4 కి సిద్ధం అవుతోంది. కాగా ఈ షోలో పాల్గొన్న నటీనటులు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలకు బాగా పాపులారిటీ లభించిన సంగతి తెలిసిందే. తెలుగులో మూడు సీజన్స్ సక్సెస్ అవడంతో బిగ్‌ బాస్ తెలుగు రియాలిటీ షోకు అటు ప్రేక్షకుల్లో ఇటు సెలబ్రిటీస్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆడియెన్స్ ఇచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయించే ఈ షోలో 'బిగ్ బాస్' సీజన్-1 లో హీరో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు. సీజన్ 2 మరియు సీజన్ 3లలో యాక్టర్ కౌశల్ మండా మరియు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుపొందాడు.

కాగా మొదటి సీజన్‌ కు హోస్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్‌ ను ప్రేక్షకుల్లోకి వెళ్లేలా చేశాడు. ఆ తర్వాత సెకండ్ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. ఇక థర్డ్ సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేసి టెలివిజన్ స్క్రీన్ పై సంచలనాలు క్రియేట్ చేశారు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా నిలిచింది మూడవ సీజన్. ఇక 'బిగ్ బాస్' 4వ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐతే ఇప్పుడు ఈ సీజన్ కి ఓ స్టార్ హీరోయిన్ హోస్ట్ చేయబోతోందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అక్కినేని నాగార్జున కాకుండా కోడలు సమంతను హోస్ట్ గా తీసుకోవడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.

కాగా బిగ్ బాస్ కి ఇంత వరకు ఫిమేల్ సెలబ్రిటీ హోస్ట్ చేయలేదు. కాకపోతే సీజన్ 3 లో నాగార్జున అందుబాటులో లేకపోవడంతో రెండు ఎపిసోడ్స్ కి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు సమంత పేరు తెర మీదకి వచ్చింది. ఐతే సమంత ప్రస్తుతం సినిమాలు నుంచి కాస్త బ్రేక్ తీసుకొని పర్సనల్ లైఫ్ మీద కాన్సంట్రేషన్ పెట్టిందని సమాచారం. కాకపోతే సమంత లాస్ట్ కమిట్ అయిన సినిమాని నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో సమంత తో పాటు నయనతార కూడా నటిస్తుంది. మరి అక్కినేని కోడలు బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది అనే వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే బుల్లితెరపై ఫేమస్ అయిన బిత్తిరి స‌త్తిని 'స్టార్ మా' వారు బిగ్ బాస్ - 4 కోసం సంప్ర‌దించిన‌ట్లుగా స‌మాచారం. ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవబోయేది నిర్వాహకులు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.