Begin typing your search above and press return to search.

వంట మనిషిగా మారిపోయిన స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   1 April 2020 1:30 AM GMT
వంట మనిషిగా మారిపోయిన స్టార్ హీరోయిన్
X
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తో షూటింగులకు విరామం ఇచ్చి ఇంటికి పరిమితమయ్యారు సెలెబ్రెటీలు. కొంతమంది సెలెబ్రెటీలు ఇంటికే పరిమితమై సోషల్ మీడియాతో కొంతమంది కాలక్షేపం చేస్తుంటే, మరికొందరు తమలో దాగివున్న ఒక్కొక్క టాలెంట్ ను బయటకి తీస్తూ వాడిని వీడియోలలో బంధించి తమ అభిమానులకు అందిస్తున్నారు. అయితే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పడుకోన్ మాత్రం వంటగదిని అందంగా సర్దుకుంటూ గడిపారు. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగ పర్చుకుంటూ దీపికా తన వంట గదిలో పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను డబ్బాల్లో సర్దుకున్నారు.

దీపికా పడుకొనే లేబుల్ ప్రింటింగ్ మెషీన్ సాయం తో వంటగదిలో వివిధ పదార్థాల పేర్లతో కూడిన ట్యాగ్ లను ఆయా బాక్సులు, డబ్బాలకు అతికించారు. పోహా, బేసన్, రాజ్మా, రెడ్ చనా, రెడ్ మసూర్ దాల్, పల్లీలు అంటూ ఇలా వంటగదిలో ఉండాల్సిన సరకుల డబ్బాలకు వాటి పేర్ల ట్యాగ్‌లను అతికించారు. లాక్ డౌన్ సమయంలో ఒక రోజంతా వంటగదిని సర్ధుకునేందుకు, వంటచేసేందుకు వినియోగించానని దీపికా తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వంటగదిలో గరిటె పట్టిన దీపికా తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా దీపికా పడుకొనే ప్రస్తుతం తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న '83' సినిమాలో నటిస్తుంది.