Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..

By:  Tupaki Desk   |   11 April 2020 12:10 PM GMT
వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో..
X
సోషల్ మీడియా బాగా విస్తరించడంతో అభిమానులు - సెలబ్రిటీల మధ్య దూరం చాలా తగ్గింది. ఈ మేరకు నెటిజన్లు తమ తమ అభిమాన నటీనటులతో చాట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనటం, వారిని సర్‌ ప్రైజ్ చేసే సదుపాయం వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'ఏ మాయ చేసావే' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే కుర్రకారు కలలరాణిగా మారిపోయింది. దాదాపు సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలు అందరితో సమంత పనిచేసింది. తక్కువ కాలంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా తెరమీద వెలుగుతోంది.

అభిమానులకు ఎల్లప్పుడూ తమ ప్రియతమ సెలబ్రిటీల విషయాలు తెలుసుకోవడానికి ఉబలాట పడుతూ ఉంటారు. అలాగే తాజాగా ఫ్యాన్స్ కోసం సమంత చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో ఉన్న పాపను చూస్తే ఎవరైనా సరే సమంత అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంత క్యూట్ గా, బొద్దుగా ఉంది ఆ పాప. ఆ ఫోటోలో సమంత చబ్బీ చీక్స్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా సమంత మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ 2019 అవార్డు సొంతం చేసుకుంది. రంగస్థలం - మజిలీ - ఓ బేబీ లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న సమంత ఇటీవలే జాను సినిమాతో ఒక ప్లాప్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉందట సామ్. చూడాలి మరి త్వరలో తెలుగులో ఏదైనా తీపి కబురు అందిస్తుందేమో..