Begin typing your search above and press return to search.

వినాయక్‌ రెడీగా ఉన్నా కూడా...

By:  Tupaki Desk   |   25 Sept 2015 9:21 AM IST
వినాయక్‌ రెడీగా ఉన్నా కూడా...
X
మొన్న తన సినిమా ఆడియో లాంచ్‌ లో ఓ విషయం చెప్పాడు అఖిల్‌. తన తదుపరి సినిమా కూడా వివి వినాయక్‌ దర్శకత్వంలోనే అన్నట్లు సెలవిచ్చాడు. అయితే 2వ సినిమానా లేకపోతే సరదాగా సెట్‌ లో పంచుకున్న ఒక కాన్సెప్టు మీద ఎప్పటికైనా ఒక సినిమా తీస్తే అందులో ఖచ్చితంగా నన్నే హీరోగా తీసుకోవాలి అని అఖిల్‌ చెప్పాడా అనే విషయం పక్కనెట్టేస్తే.. అసలు.. వై వినాయక్‌?

ఆ విషయానికి స్వయంగా మహేష్‌ బాబే ఆన్సర్‌ ఇచ్చాడు. ఒక హీరోను.. అత్యంత హీరోయిజమ్‌ తో మాంచి కమర్షియల్‌ యాంగిల్‌ తో చూపించాలంటే అది ఖచ్చితంగా వినాయక్‌ వలనే అవుతుంది. ఇంకెవరి వలనా అవ్వదు. అని మహేష్‌ తేల్చేశాడు. బాగానే ఉంది. అందుకే కదా వినాయక్‌ సినిమాలు యావరేజ్‌ అని టాక్‌ తెచ్చకున్నా కమర్షియల్‌ గా కాస్త ఎక్కువగా కాసులు కురిపించేది. అయితే ఇక్కడే ఓ లాజిక్‌ ఉంది. అసలు వినాయక్‌ సినిమాను డైరక్ట్‌ చేయాలంటే ముందు కథ కావాలి. తన చేతిలో కథను వేస్తే వినాయక్‌ వండర్‌ ఫుల్‌ గా వండి వడ్డిస్తాడు కాని, చేతిలో కథ లేకుండా సినిమా చేద్దాం అంటే మాత్రం కాస్త కష్టమే.

అందుకే చాలామంది యువ హీరోలకు వినాయక్‌ తో సినిమా చేయాలని ఉన్నా.. కథ లేక ఆగిపోతుంటారు. ఒకవేళ ఏ ఆకుల శివతోనో.. వెలిగొండ శ్రీనివాస్‌ తోనో ఒక కథ రాయించుకుంటే.. దానిని వినాయక్‌ దగ్గరకు తీసుకెళితే పనవుతుంది. అది సంగతి.