Begin typing your search above and press return to search.

బర్త్ డే హ్యాష్‌ ట్యాగులతో పోటీ పడుతున్నారే

By:  Tupaki Desk   |   25 Oct 2017 10:47 PM IST
బర్త్ డే హ్యాష్‌ ట్యాగులతో పోటీ పడుతున్నారే
X
ఒకప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా యక్టివ్ గా ఉండని తెలుగు హీరోల అభిమానులు ఇప్పుడు మాత్రం ట్విట్టర్ వంటి సోషల్ సర్క్యూట్లలో బాగానే సందడి చేస్తున్నారు. ముఖ్యంగా హ్యాష్ ట్యాగులను ట్రెండింగ్ చేయడంలో వీరికి వీరే సాటి అయిపోతున్నారు.

అదిగో ఈ మధ్యన మనోళ్ళు పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు..ఎన్టీఆర్ తదితర హీరోల పుట్టినరోజులకు ట్రెండ్ చేసిన హ్యాష్ ట్యాగుల ట్రెండింగ్ రేంజ్ ఎలా ఉందో ఇప్పుడు ఒక సంస్థ బయటపెట్టింది. 24 గంటల్లో సదరు హ్యాష్ ట్యాగుతో ఎన్ని ట్వీట్లు చేశారో చూస్తే మనకు మతిపోవాల్సిందే. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు.. #HBDLEADERPAWANKALYANఅనే హ్యాష్‌ ట్యాగ్‌ తో సుమారు 2.9 మిలియన్లకు పైగా ట్వీట్లు వేశారట అభిమానులు. అలాగే మొన్న ప్రభాస్ బర్త్ డే నాడు.. #HBDDARLINGPRABHAS అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో కంగా 2.1 మిలియన్ ట్వీట్లు నమోదు అయ్యాయట. వీటికంటే ముందు #HBDMAHESHBABU అంటూ సుమారు 1.1మిలియన్ల మహేష్ బాబు బర్త్ డే నాడు శుభాకాంక్షలు తెలపగా.. #HAPPYBIRTHDAYNTR అంటూ 6.90 లక్షల మంది ట్వీట్లు వేసినట్లు సదరు రిపోర్టు చెబుతోంది.

అంటే నానాటికి మన తెలుగు ఆడియన్స్ ట్విట్టర్లో తెగ యాక్టివ్ అయిపోతున్నారనమాట. ఇప్పుడు ఈ నెంబర్లను చూసుకుంటూ.. మా హీరోకు ఎక్కువ ట్వీట్లు అంటే మా హీరోకు ఎక్కువ ట్వీట్లు వచ్చాయి అంటూ రచ్చ చేసి అభిమానుల సంఖ్య కూడా పెరుగుతోందిలే.