Begin typing your search above and press return to search.

మళ్ళీ సెట్స్ లో అడుగుపెడుతున్న స్టార్ హీరోలు..!

By:  Tupaki Desk   |   6 July 2021 9:00 AM IST
మళ్ళీ సెట్స్ లో అడుగుపెడుతున్న స్టార్ హీరోలు..!
X
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభమవుతున్నాయి. కరోనా కేసులు తగ్గిన కారణంగా తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేయడంతో చాలా చిన్న మీడియం రేంజ్ సినిమాలను రీ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు కూడా ఒక్కొక్కరుగా సెట్స్ లో అడుగుపెడున్నారు. ఇప్పటికే జూ.ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ మొదలుపెట్టి టాకీ పార్ట్ పూర్తి చేశారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఆగస్ట్ లోపు వీటిని కూడా చిత్రీకరించాలని చిత్ర యూనిట్ ప్లాన్ రెడీ చేసుకుంది.

చిరంజీవి - రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ మంగళవారం నుంచి పునఃప్రారంభం కానుంది. కేవలం 10 రోజుల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉండటం.. సెట్ కూడా రెడీగా ఉండటంతో వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ చేయాలని కొరటాల భావిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధే శ్యామ్' షూట్ మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే హీరోయిన్ పూజాహెగ్డే కు సంబంధించిన సీన్స్ షూట్ చేసారని తెలుస్తోంది. సోమవారం నుంచి ప్రభాస్ కూడా సెట్స్ లో అడుగుపెట్టారని సమాచారం. ఫాస్ట్ గా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి 'ఆదిపురుష్' చిత్రీకరణలో జాయిన్ అవ్వాలని డార్లింగ్ ప్లాన్ చేసుకున్నారు. ఇదే క్రమంలో 'సలార్' ని కూడా షురూ చేసే అవకాశం ఉంది. 'రాధే శ్యామ్' పూర్తి చేసిన వెంటనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' షూటింగ్ కూడా సోమవారం మొదలైంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన మెజారిటీ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. పెండింగ్ వర్క్ ని కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెకండ్ వేవ్ త‌రువాత షూటింగ్ జరిగే విధానాన్ని బట్టి రిలీజ్ డేట్ లాక్ చేయాలని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ ని కూడా వచ్చే వారం మళ్ళీ మొదలు పెట్టనున్నారు. జులై 11 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి ఆగస్ట్ నెలాఖరుకు మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనిని బట్టి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. జూలై 15 నుంచి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో SSMB28 చిత్రాన్ని మొదలుపెట్టేలా మహేష్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

వెంకటేష్ - వరుణ్ తేజ్ ల 'ఎఫ్ 3'.. నాగచైతన్య 'థాంక్యూ'.. నాని 'శ్యామ్ సింగ రాయ్' సినిమాల తాజా షెడ్యూల్స్ ప్రారంభమయ్యాయి. రవితేజ కొత్త సినిమాకి షురూ చేశారు. బాలకృష్ణ - బోయపాటి శ్రీను 'అఖండ'.. సమంత - గుణశేఖర్ ల 'శాకుంతలం'.. అక్కినేని నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబోలో సినిమాలను కూడా మళ్ళీ మొదలుపెట్టలని చూస్తున్నారు. ఇలా సెకండ్ వేవ్ తరువాత ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు సెట్స్ లో అడుగుపెడితే.. మరొకొందరు మేకప్ వేసుకోడానికి సిద్ధమవుతున్నారు.