Begin typing your search above and press return to search.

స్టార్ హీరోపై భార్యకు అనుమానమా?

By:  Tupaki Desk   |   12 Jun 2017 3:57 PM GMT
స్టార్ హీరోపై భార్యకు అనుమానమా?
X
అతనో స్టార్ హీరో.. ఇప్పటికే ఫ్యామిలీతో ఎంచక్కా సెటిల్ అయిపోయాడు కూడా. బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడంతో.. ఇండస్ట్రీలో కూడా బోలెడంత వాల్యూ ఉంది. అయితే.. ఈ మధ్య ఈ స్టార్ హీరో భార్య.. ఈ హీరోను అనుమానిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

గతంలో హీరోపై ఎలాంటి అనుమానాలు లేని ఈమె.. ఇప్పుడు అనుమానించడమే చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. హీరో షూటింగ్ చేస్తున్న ప్రదేశాలకు కూడా వచ్చేస్తోంది. అక్కడి పరిస్థితిని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తోందట. ఇందుకు కారణం.. తన మాజీ హీరోయిన్ తో ఆ హీరో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడట. అదే హీరో వైఫ్ కు బాగా అనుమానం తెప్పిస్తోందని తెలుస్తోంది. తన భర్తతో ఉన్న అనుబంధం కారణంగానే ఇలా షూటింగులకు వస్తోందని అంతా మొదట అనుకున్నారు కానీ.. అసలు విషయం అందరికీ ఆలస్యంగా అర్ధమైందట. సెట్స్ లో కూడా ఆ హీరో హీరోయిన్లు క్లోజ్ గా మూవ్ కావడం కూడా ఈ గాసిప్ లు రావడానికి కారణం అంటున్నారు.

స్టార్ హీరో కావడం.. బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కావడంతో.. కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకే.. స్టార్ హీరో వైఫ్ ఇలా ప్రవర్తిస్తోందని అంటున్నారు. నిజానికి ఆ హీరో కూడా బాగా ప్రొఫెషనల్ అంటారు కానీ.. ఈ ఒక్క హీరోయిన్ దగ్గరే ఇలాంటి టాక్ వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/