Begin typing your search above and press return to search.

3 కోట్ల కారుతో షికారు చేస్తున్న స్టార్ హీరో

By:  Tupaki Desk   |   5 Oct 2019 6:17 PM IST
3 కోట్ల కారుతో షికారు చేస్తున్న స్టార్ హీరో
X
బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఎక్కడ ఉంటే అక్కడ తన చుట్టూ ఉన్నవాళ్ళతో కలిసిపోయి సందడి చేస్తుంటాడు. ఇటీవలే అతను నటించిన గల్లీబోయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఇతను '83' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కపిల్ దేవ్ పాత్రను రణ్ వీర్ చేస్తున్నాడు. తన భార్య దీపికా పడుకొనేతో కలిసి ఇంకొక మూవీ కూడా రణ్ వీర్ చేతిలో ఉంది. ఈ సినిమా 2020 ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది.

ప్రస్తుతం రణ్ వీర్ కి కొంచెం ఖాళీ దొరకడంతో తాను కొత్తగా కొనుక్కున్న కారుతో మంబై రోడ్ల మీద షికారు చేశాడు. రెడ్ కలర్ ను ఎంతో ఇష్టపడే రణ్ వీర్ ఇటలీకి చెందిన సూపర్ కార్లను తయారుచేసే లంబోర్గిని లగ్జరీ కారును కొన్నాడు. ఇంకా ఆ కార్ కి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా రాలేదు. దీని ధర 3 కోట్లకు పైగానే ఉంటుంది. దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్ల పరిశ్రమ కుదేలవుతుందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో రణ్ వీర్ ఇంత కాస్ట్లీ కారు కొనడం విశేషం.