Begin typing your search above and press return to search.

సైలెంట్ గా సైనిక దళాలపై డాక్యుమెంటరీ తీసిన స్టార్ హీరో!!

By:  Tupaki Desk   |   15 Jan 2021 11:00 PM IST
సైలెంట్ గా సైనిక దళాలపై డాక్యుమెంటరీ తీసిన స్టార్ హీరో!!
X
బాహుబలి మూవీతో నటుడుగా స్టార్డం అందుకున్నాడు దగ్గుబాటి రానా.. ప్రస్తుతం హీరోగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. చేతిలోని ఒక్కో సినిమాను ఫినిష్ చేస్తూ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఇటీవలే రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ "అరణ్య" విడుదల తేదీ ప్రకటించింది చిత్రబృందం. తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన అరణ్య సినిమాను తెలుగు, తమిళ, హిందీ బాషలలో విడుదల చేయనున్నారు. అంతేగాక విరాటపర్వం సినిమా కూడా తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన విరాటపర్వం పోస్టర్ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం రానా గుట్టుచప్పుడు కాకుండా మరో భారీ హాలీవుడ్ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ ఓకే చెప్పాడని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా రానా ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎఫ్ఎఫ్ పై ఓ డాక్యుమెంటరీ రూపొందించినట్లు సమాచారం. అప్పుడప్పుడు టీవీ షోలలో కూడా మెరిసే రానా, సైనిక దళాల పై డాక్యుమెంటరీ తీసి గొప్ప పని చేసానని.. అంతకన్నా ఎక్కవగా గొప్ప అనుభవం పొందినట్లు తెలిపాడు రానా. మరి రానా చేసిన డాక్యుమెంటరీ ఏంటంటే.. స‌రిహ‌ద్దు ద‌ళాల ప‌నితీరు పై డిస్క‌వ‌రీ ప్ల‌స్ ఛానెల్‌తో క‌లిసి `మిష‌న్ ఫ్రంట్ లైన్` అనే డాక్యుమెంట‌రీ చేశాడ‌ట‌. ఈ డాక్యుమెంట‌రీ డిస్క‌వ‌రీ ప్ల‌స్‌లో జ‌న‌వ‌రి 21న ప్ర‌సారం అవుతుంద‌ని తెలిపాడు. ఈ విషయం తెలిసి రానా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో ఇలాంటి సాహస వీరుల గురించి డాక్యుమెంటరీ రూపంలో జనాలకు చూపించడం గొప్ప విషయమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు