Begin typing your search above and press return to search.

రతన్‌ టాటా బయోపిక్‌ పై స్పందించిన స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   12 Dec 2020 5:51 PM IST
రతన్‌ టాటా బయోపిక్‌ పై స్పందించిన స్టార్‌ హీరో
X
ఆకాశమే నీ హద్దురా సినిమా తర్వాత రతన్ టాటా బయోపిక్‌ ను రూపొందించేందుకు ఏర్పాట్లు వార్తలు వస్తున్నాయి. వ్యాపార దిగ్గజం అయిన రతన్‌ టాటా సినిమా అంటే దేశ వ్యాప్తంగా కూడా అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌ తో సుధ కొంగర దర్శకత్వంలో నిర్మించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. రతన్‌ టాటా బయోపిక్‌ పై సోషల్ మీడియాలో గత రెండు మూడు రోజులుగా భారీ ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మాధవన్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

రతన్‌ టాటా బయోపిక్‌ విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు తారా స్థాయికి చేరడంతో మాధవన్‌ స్పందించాడు. మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ మాధవన్‌ ట్వీట్‌ చేశాడు. కొందరు అభిమానులు ఆ పోస్టర్‌ ను తయారు చేశారు. అలాంటి ప్రాజెక్ట్‌ ఏదీ కూడా చర్చల్లో కూడా లేదు అంటూ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ విషయంలో మాధవన్‌ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దురా సినిమా సక్సెస్‌ అవ్వడంతో రతన్ టాటా సినిమా విషయంలో కూడా ఆమె ఆలోచించాలని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.