Begin typing your search above and press return to search.

డేంజ‌ర‌స్ గ్యాంగ్ స్టర్ గా మారిన స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   27 March 2021 9:00 AM IST
డేంజ‌ర‌స్ గ్యాంగ్ స్టర్ గా మారిన స్టార్ హీరో!
X
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం ప్రిప‌రేష‌న్ సాగించ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఇప్ప‌టికే అతడు వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు క‌మిట‌య్యారు.. ఇందులో క్రిష్ 4.. వార్ 2 లాంటి క్రేజీ సీక్వెల్స్ ఉన్నాయి. అయితే ఈ సీక్వెల్స్ సెట్స్ కి వెళ్ల‌క ముందే అత‌డు `విక్ర‌మ్ వేద` రీమేక్ లో న‌టించేందుకు రెడీ అవుతున్నారు. హృతిక్ రోష‌న్ న‌టిస్తున్న 25వ సినిమాగా ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ కి బోలెడంత హైప్ నెల‌కొంది.

రోజుకు 3000 కేలరీల బ‌రువును త‌గ్గించుకునే లక్ష్యంతో విస్తృతమైన శిక్షణతో కఠినమైన ఆహారం పాటించడం ద్వారా హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రానికి ప్రిపరేషన్ ప్రారంభించాడని ఇటీవ‌ల‌ క‌థ‌నాలొచ్చాయి. గత రెండు నెలలుగా పూర్తి స్థాయి ప్రిపరేషన్ సాగుతోంది.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ హిందీ థ్రిల్లర్ లో భయంకరమైన గ్యాంగ్ స్టర్ వేధ పాత్రలో హృతిక్ క‌నిపిస్తారు. త‌న పాత్ర తీరుతెన్నుల్ని తెలుసుకునేందుకు స‌ద‌రు రియ‌ల్ గ్యాంగ్ స్ట‌ర్ జీవించిన ప్ర‌దేశానికి హృతిక్ వెళ్లార‌ని తెలిసింది. బాడీ లాంగ్వేజ్ ప్రిప‌రేష‌న్ లో భాగంగా డిక్షన్ అలాగే లుక్ కోసం గత రెండు నెలలుగా ఈ గ్యాంగ్ స్టర్ ప్రదేశంలో ఉన్నాడు. పాత్ర‌లో ఒరిజినాలిటీని తెరపైకి తెచ్చేందుకే ఈ క‌స‌ర‌త్తు అని తెలిసింది.

ఈ చిత్రంలో హృతిక్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తుండగా సైఫ్ అలీఖాన్ పోలీసు విక్రమ్ గా నటిస్తారు. పుష్కర్ - గాయత్రి ద‌ర్శ‌క‌ద్వ‌యం ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ఈ వేసవిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి.విక్రమ్ వేద తరువాత‌ హృతిక్ హాట్ స్టార్ తో తన డిజిటల్ అరంగేట్రం కోసం సన్నద్ధమవుతారు. ఫైటర్- క్రిష్ 4 చిత్రాల్లోనూ న‌టించాల్సి ఉంది. అల్లు రామాయణం తో పాటు వార్ సీక్వెల్ కోసం కూడా అతను చర్చలు సాగిస్తున్నారు.