Begin typing your search above and press return to search.

యాక్టింగ్ కంటే కెలుకుడే ఎక్కువైందట

By:  Tupaki Desk   |   19 March 2020 6:50 AM GMT
యాక్టింగ్ కంటే కెలుకుడే ఎక్కువైందట
X
ఆయన ఓ సీనియర్ స్టార్. ఈమధ్య ఓ హాట్ షాట్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. అయితే ఎంత స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ హీరోగారిని హ్యాండిల్ చెయ్యడంలో ఇబ్బందులు తప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సీనియర్ స్టార్ కు మొదటి నుంచి డైరెక్టర్ పనిలో వేలు పెట్టి కెలికే అలవాటు ఉంది. సాదా సీదా దర్శకులు.. ఏదో కొత్త మొహాలు అయితే పెద్దగా పట్టించుకోరు కానీ ఈయన మాత్రం ఆ కెలుకుడు నచ్చక తెగ ఫీలయిపోతున్నాడట.

ఆ స్టార్ హీరోకు చాలాకాలం నుంచి దర్శకుడి పనిలో వేలు పెట్టడం అలవాటే. ఒక్కోసారి కథలో లీనమైతే డైరెక్టర్ ను పక్కన పెట్టి తనే దర్శకత్వం వహించే స్థాయికి వెళ్తుందట. గతంలో ఆయన నటించిన కొన్ని సినిమాలకు కథ బాగున్నప్పటికీ ఫెయిల్ కావడానికి కారణం ఈ కెలుకుడు వ్యవహారమేనట. తన తాజా చిత్రం కథ విషయంలో ఇప్పటికే వేలు పెట్టేసిన ఈ సీనియర్ స్టార్ ఇప్పుడు దర్శకత్వంలో కూడా తన ప్రతాపం చూపిస్తున్నాడట.

ఈ వ్యవహారం కారణంగా డైరెక్టర్.. స్టార్ హీరో మధ్య ఇప్పటికే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చిందట. హీరో గారి తీరు ఇదేరకంగా కొనసాగితే సినిమా అవుట్ పుట్ పై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాను సవ్యంగా పూర్తి చేయడం కూడా దర్శకుడికి ఓ టెస్ట్ లాంటిది అని చెవులు కొరుక్కుంటున్నారు.