Begin typing your search above and press return to search.
ఆ హీరో మోజు పడితే రిపీట్ చేయాల్సిందే...!
By: Tupaki Desk | 18 Aug 2020 4:00 PM ISTసినీ ఇండస్ట్రీలో నెపోటిజం(బంధుప్రీతి) - ఫేవరిటిజం(స్వాభిమానము) అనేవి కీలక పాత్ర పోషిస్తాయని ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. తమ ఫ్యామిలీకి చెందిన వారికి అవకాశాలు వచ్చేలా చేస్తుంటారని.. తమకు నచ్చిన వారిని రికమెంట్ చేస్తారని.. కమిట్మెంట్ ఇచ్చిన వారికే సినీ అవకాశాలు వస్తుంటాయని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. మన టాలీవుడ్ లో కూడా దీనిపై చాలామంది బాహాటంగా విమర్శలు చేసారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఓ హీరో ఇలాంటి వ్యవహారశైలినే చూపిస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో ఓ హీరో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన స్వయంకృషితో సక్సెస్ సాధించాడు. సహజమైన నటనతో సినీ ప్రేక్షకులను అలరించిన ఆ హీరోపై పలు వివాదాలు కూడా తలెత్తాయి. అయితే ఇప్పుడు ఆ హీరో సినిమాలో తాను చెప్పిన హీరోయిన్ ని మాత్రమే తీసుకోవాలని మేకర్స్ పై ఒత్తిడి చేస్తున్నాడట. ఆ హీరో ఆమెనే ఎందుకు హీరోయిన్ గా రికమెండ్ చేస్తున్నాడో తెలియదు కానీ.. ఈ హీరో పంతం ఎఫెక్ట్ ప్రాజెక్ట్ పై పడుతోందట.
కాగా వరుస సినిమాలతో దూకుడు మీదున్న ఆ హీరో యంగ్ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ పట్టాలెక్కించేసాడు. ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ప్రొడ్యూసర్ కి హీరోకి మధ్య విబేధాలు తలెత్తుతున్నాయని టాక్ వస్తోంది. మన హీరో ఆల్రెడీ అతనితో కలిసి నటించిన హీరోయిన్ ని తీసుకోమని ప్రొడ్యూసర్స్ ని డిమాండ్ చేస్తున్నాడట. అయితే నిర్మాతలు మాత్రం వేరే హీరోయిన్ ని తీసుకుందామని చెప్తున్నారట. ఇలా వీరిద్దరి మధ్య వచ్చిన తేడాల వల్ల పాపం ఆ యంగ్ డైరెక్టర్ నలిగిపోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు.