Begin typing your search above and press return to search.
నిర్మాతగా మారనున్న స్టార్ హీరో..!
By: Tupaki Desk | 29 April 2021 3:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఎంతటి ప్రతిభ కలిగిన నటుడో అందరికి తెలిసిందే. అందుకే దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటీవలి కాలంలో షాహిద్ ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయినటువంటి సినిమాలనే హిందీలో రీమేక్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న షాహిద్.. ప్రస్తుతం టాలీవుడ్ జెర్సీ మూవీని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే నేషనల్ అవార్డులు అందుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జెర్సీతో పాటు షాహిద్ చేతిలో చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. జెర్సీ తర్వాత షాహిద్ డైరెక్టర్స్ రాజ్ డీకే లతో ఓ సినిమాతో పాటు శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో యోధా మూవీ చేయాల్సి ఉండేది. కానీ ఎందుకో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు షాహిద్.
అలాగే ప్రస్తుతం చర్చల దశలో కొన్ని సినిమాలున్నాయి. వాటిలో ఒకటి 'ఆకాశం నీ హద్దురా'. రామ్ మాధవనితో ఒకటి, అలాగే రాకేష్ ఓంప్రకాష్ మెహ్ర దర్శకత్వంలో కర్ణ. వీటితో పాటు షాహిద్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఓటిటిలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం.. షాహిద్ నెట్ ఫ్లిక్స్ వారితో ఓ పౌరాణిక చిత్రం డీల్ ఓకే చేసుకున్నాడట. ఈ ప్రాజెక్ట్ కోసం షాహిద్ కు నెట్ ఫ్లిక్స్ 70-80కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఓ మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ చేస్తూనే మరోవైపు నిర్మాణంలో కూడా భాగస్వామ్యం కాబోతున్నాడు. ఎప్పటినుండో ప్రొడక్షన్ ప్రారంభించాలని అనుకుంటున్న షాహిద్ నెట్ ఫ్లిక్స్ పుణ్యమా అని నిర్మాత కానున్నాడు. అయితే ఇదే గనక నిజమైతే షాహిద్ కెరీర్ లో సెకండ్ మైథాలజీ మూవీ కాబోతుంది. చూడాలి మరి షాహిద్ నిర్మాతగా సక్సెస్ అవుతాడేమో!