Begin typing your search above and press return to search.

ఫింగరింగ్ ఎక్కువైందని స్టార్ హీరోపై అలకబూనిన యువ హీరో..!

By:  Tupaki Desk   |   14 Aug 2020 5:30 AM GMT
ఫింగరింగ్ ఎక్కువైందని స్టార్ హీరోపై అలకబూనిన యువ హీరో..!
X
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ తో పని లేకుండా.. యాక్టింగ్ వచ్చినా రాకున్నా.. బ్యాగ్రౌండ్ ఉంటే చాలు వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టేయవచ్చు. ఒక్కరు ఇండస్ట్రీలో అడుగుపెడితే వారి బాటలో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. ఇది మన ఒక్క టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు.. అన్ని ఇండస్ట్రీలలో తమ నట వారసులను పరిచయం చేస్తూ వస్తున్నారు. నెపోటిజం అని ఎన్ని ఉద్యమాలు జరిగినా ఎన్ని చర్చలు జరిగినా దీనిని మాత్రం ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తన ఫ్యామిలీ మెంబెర్ ని కాకుండా పక్కవారిని ఎంకరేజ్ చేయాలని ఎందుకు అనుకుంటాడు చెప్పండి. అందుకే సినీ ఇండస్ట్రీతో పాటు ప్రతి ఇండస్ట్రీలో బంధుప్రీతి అనేది కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్ లోని ఓ పెద్ద ఫ్యామిలీ నుండి ఎన్నో అంచనాలతో ఓ స్టార్ హీరో వారసుడు ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌.. ఆక‌ట్టుకునే అందం.. ఆడియన్స్ ని మెప్పించగల ప్రతిభ.. అన్నీ ఉన్నా ఆ హీరోకి సూపర్ హిట్ మాత్రం అందడం లేదు. మొదటి సినిమా నుంచి ఎలాగైనా బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఎంత కష్టపడుతున్నా ఫలితం లేకుండా పోతోంది. హిట్ టాక్ తెచ్చకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం అనేది నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఆ స్టార్ హీరో తనయుడి సినీ కెరీర్ ఎలాగైనా గాడిలో పెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తనయుడి బాధ్యతని ఓ స్టార్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టారు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే హైప్ క్రియేట్ అవడంతో ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడని అందరూ డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ స్టార్ హీరోకి అతని కొడుక్కి పడటం లేదట టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం కొడుకు కెరీర్ మీద ఫోకస్ పెట్టి ఆ స్టార్ హీరో ప్రతి సినిమాలోనూ వేలు పెట్టడటం అతనికి నచ్చడం లేదట. ప్రస్తుతం కచ్చితంగా హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్న సినిమా విషయంలో కూడా ఫింగరింగ్ చేస్తున్నాడని.. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కూడా అలానే వ్యవహరిస్తున్నారని.. ఇదే గొడవకి అసలు కారణం అని ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. తన అనుభవంతో తనయుడు కెరీర్ ని గాడిలో పెట్టాలని చూస్తున్న ఆ స్టార్ హీరోని యువ హీరో అర్థం చేసుకోలేకపోతున్నాడని కామెంట్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఆ హీరోకి ఒక్క సూపర్ హిట్ పడితే స్టార్ హీరో రేంజ్ కి వెళ్లే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. ప్రస్తుతం నటిస్తున్న సినిమా అందరికి సమాధానం చెప్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.