Begin typing your search above and press return to search.

రీమేక్ సినిమాకు స్టార్ హీరో షాకింగ్ రెమ్యూనరేషన్..!

By:  Tupaki Desk   |   2 April 2021 8:00 AM IST
రీమేక్ సినిమాకు స్టార్ హీరో షాకింగ్ రెమ్యూనరేషన్..!
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాల సందడి బాగానే నెలకొంది. గత రెండుమూడేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఇండియన్ మూవీస్ రీమేక్ అవుతున్నాయి. అలాగే సౌత్ రీమేక్ సినిమాల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజాగా మరో సూపర్ హిట్ సినిమా హిందీలో రీమేక్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో తమిళ చిత్రం 'విక్రమ్ వేద' తెరకెక్కనుంది. 2017లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా విక్రమ్ వేద తెరకెక్కింది. ఐతే ఇప్పుడు హిందీలో గ్యాంగస్టర్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తుండగా.. పోలీస్ పాత్రలో సైఫ్ కనిపించనున్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ రీమేక్ సినిమాకు కూడా ఒరిజినల్ డైరెక్టర్స్ పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించనున్నారు. ఐతే కొద్దికాలం నుండే హృతిక్ ఈ సినిమాకోసం వర్కౌట్స్ ప్రారంభించాడట. అసలు విషయం ఏంటంటే.. హృతిక్ కెరీర్లో ఇది 25వ సినిమా కావడం విశేషం. బాలీవుడ్ వర్గాల కథనాలను బట్టి ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని టాక్. అలాగే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు హృతిక్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తుంది. హృతిక్ ఈ రీమేక్ సినిమాకు 50కోట్లు పారితోషికం అందుకోనుండగా.. సైఫ్ తన పాత్రమేరకు 12కోట్లు తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం హృతిక్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఫైటర్ సినిమాతో పాటు క్రిష్-4, వార్-2 లైన్ లో ఉన్నాయట. చూడాలి మరి వేద పాత్రకు హృతిక్ ఎంతవరకు న్యాయం చేస్తాడో!