Begin typing your search above and press return to search.

బాలీవుడ్ ఎంట్రీ పై స్పందించిన స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   25 March 2021 9:27 AM GMT
బాలీవుడ్ ఎంట్రీ పై స్పందించిన స్టార్ హీరో..!
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకడు హీరో విశాల్. పందెంకోడి సినిమా దగ్గరనుండి ఇటీవలి చక్ర సినిమా వరకు విశాల్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. అందుకే తెలుగులో కూడా విశాల్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నిజానికి సినిమా స్టోరీ బాగుంటే ఏ భాషా సినిమానైనా ఆదరిస్తారు సినిమా ప్రేక్షకులు. అందులోను మన తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే సూపర్ హిట్ చేస్తారు. అయితే విశాల్ ప్రస్తుతం ఎనిమి, డిటెక్టివ్-2 సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు హెల్పింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాడు. తాజాగా విశాల్ సోషల్ మీడియా పై ఫైర్ అయ్యాడు. విడుదల కానున్న సినిమాలను వెంటనే పైరసీ చేసి ఆన్ లైన్ లో పెడుతున్నారని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూలో విశాల్ ఈ విషయంలో స్పందించాడు. అలాగే ఈ సమయంలో తన బాలీవుడ్‌ ఎంట్రీ పై స్పందించారు. అలాగే దక్షిణాది చిత్రాలు బాలీవుడ్‌లోకి.. బీటౌన్‌ సినిమాలు ఇక్కడికి రీమేక్‌ కావడంపై విశాల్‌ తన అభిప్రాయం బయటపెట్టాడు. విశాల్ మాట్లాడుతూ..‘‘బాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేను. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తా. అలాగే, ఏ సినిమాకైనా కథే హీరో. కథ బాగుంటే ఏ భాషా చిత్రానైనా ప్రేక్షకులు హిట్ చేస్తారు. లాక్‌డౌన్‌లో విరామం దొరకడంతో దక్షిణాది, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని భాషా సినిమాలను జనాలు చూసేసారు. నిజానికి సౌత్ ఇండియన్ చిత్రాలలో కథ, స్క్రీన్‌ప్లే.. చాలా బాగుంటాయి. ఇదిలా ఉండగా.. పైరసి పై మాట్లాడుతూ.. పైరసీ విషయంలో సినిమా సంస్థలు, గవర్నమెంట్ సైబర్ సెల్ సరిగ్గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని.. అంతేగాక ఇప్పటికే పలువురితో యాంటీ పైరసి టీమ్ ప్రారంభం చేసినట్లు చెప్పుకొచ్చాడు.