Begin typing your search above and press return to search.

విజయ్ సినిమాను రిజెక్ట్ చేసింది నిజమే: స్టార్ హీరో

By:  Tupaki Desk   |   11 Dec 2022 10:30 AM GMT
విజయ్ సినిమాను రిజెక్ట్ చేసింది నిజమే: స్టార్ హీరో
X
తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో ఛాన్స్ వస్తే నటించడానికి ఓవర్గం హీరోలు కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ రేంజ్ లో పెరిగింది. విజయ్ సినిమాలో నటిస్తే వారి ఫ్యాన్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొంతమంది విజయ్ సినిమాలో కీలక పాత్రలో నటించడానికి వెంటనే ఒప్పుకుంటారు. ఇదివరకే విజయ్ సేతుపతి మాస్టర్ సినిమాలో విలన్ గా కనిపించే అతని ఫ్యాన్స్ మద్దతు అందుకున్నాడు.

ఒక విధంగా ఆ పాత్ర కూడా బాగా క్లిక్ అవ్వడమే కాకుండా మంచి పారితోషికం కూడా వచ్చింది. విజయ్ సినిమాలో నటిస్తే రెమ్యునరేషన్ విషయంలో కూడా జాక్ పాట్ కొట్టేసినట్లే అని చెప్పవచ్చు. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ 67వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో విలన్ పాత్ర కోసం ఒక ప్రముఖ హీరోను తీసుకోబోతున్నట్లుగా టాక్ అయితే వినిపించింది.

ముఖ్యంగా విశాల్ దాదాపు ఫైనల్ అయినట్లు కూడా కథనాలు అయితే వైరల్ అయ్యాయి. ఇక మొత్తానికి హీరో విశాల్ ఇటీవల ఆ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ లోకేష్ ను సంప్రదించిన విషయం వాస్తవమేనని అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణంగా తను కొత్త ప్రాజెక్టులను ఓకే చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా తెలియజేశాడు. ఆ కారణం చేతనే ఆ సినిమాలో నటించలేనని చెప్పినట్లుగా విషయాలు సున్నితంగా వివరణ అయితే ఇచ్చాడు.

ఒకవైపు ఫ్యాన్స్ ను హర్ట్ చేయకుండా అతను ఇచ్చిన వివరణ అయితే బాగానే ఉంది. ఇక విలన్ పాత్రలో చేయడానికి తనకు ఏమాత్రం ఇబ్బందులు లేదు అని మంచి పాత్రలు వస్తే అలాగే తనకు సమయం కుదిరితే చేస్తాను అని కూడా విశాల్ అన్నాడు.

ఇక భవిష్యత్తులో మాత్రం తప్పకుండా విజయ్ తో ఒక సినిమాను డైరెక్టర్ చేయాలని ఉంది అని కూడా తను అన్నాడు. ఇక అందులో విలన్ పాత్ర అయినా సరే తాను నటించడానికి సిద్ధమే అని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం విశాల్ లాఠీ అనే సినిమాతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.