Begin typing your search above and press return to search.

పుష్ప పై స్పందించిన స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   7 April 2021 1:30 PM GMT
పుష్ప పై స్పందించిన స్టార్ హీరో!
X
మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అతను తెలుగు తప్ప మిగతా భాషలు తమిళ, కన్నడ భాషల్లో చాలా ఫేమస్. ఆయన చేసిన సినిమాలే అంతటి స్టార్డం సంపాదించిపెట్టాయి. అలాగే అద్భుతమైన తన టాలెంట్ తో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఫాహద్ పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ సినిమాలో విలన్ రోల్. అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఢీకొనే క్యారెక్టర్ తో ఫాహద్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇప్పటివరకు ఫాజిల్ నటన గురించి మలయాళం, తమిళం ప్రేక్షకులకే తెలుసు పుష్ప తర్వాత ఫాహద్ యాక్టింగ్ తెలుగువారు ఎంజాయ్ చేయనున్నారు.

అలాగే పుష్ప రిలీజ్ అయ్యాక ఫాహద్ కు తెలుగులో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో స్పందించాడు ఫాహద్. ఆయన మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో తన క్యారెక్టర్ చాలా ఫ్రెష్ గా.. తను ఇంతవరకు చేయని డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలిపాడు. తాజాగా ఫాహద్ నటించిన 'జోజి' సినిమా డిజిటల్ రిలీజ్ అయింది. అలాగే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ కూడా రావడంతో ఫాహద్ ఆనందం వ్యక్తం చేస్తూ పుష్ప మూవీ పై స్పందించాడు. ఇక పుష్ప సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల కాబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.