Begin typing your search above and press return to search.
స్టార్ హీరో నాచురల్ లుక్ వైరల్
By: Tupaki Desk | 5 Jan 2021 8:33 AM ISTహీరోలు లేదా హీరోయిన్స్ ను మనం ఎక్కువగా మేకప్ లో మాత్రమే చూస్తూ ఉంటాం. కొందరు స్టార్స్ మేకప్ లేకుండా బయట కనిపించాలని భావించరు. చాలా మంది మేకప్ లో మేకప్ లేకుండా చాలా తేడా కనిపిస్తారు. హీరోయిన్స్ విషయం పక్కన పెడితే హీరోల్లో కూడా కొందరిని మేకప్ లేకుంటే చూడటం కష్టంగా ఉంటుంది. కాని కొందరు హీరోలు మాత్రం మేకప్ లేకుండా నాచురల్ గానే బాగున్నారు అనిపిస్తుంది. అజిత్ ను ఆయన హీరోలు ఎప్పుడు కూడా నాచురల్ గా చూడాలనుకుంటారు. అందుకే తెల్ల గడ్డం తెల్ల జుట్టుతోనే అజిత్ నటిస్తూ ఉంటాడు. ఇక సూర్య కూడా తాజాగా తన నాచురల్ లుక్ తో అభిమానుల ముందుకు వచ్చాడు.
తన హోం జిమ్ లో ఆన్ లైన్ ద్వారా ట్రైనర్ సూచనలు చేస్తూ ఉండగా వర్కౌట్లు చేశాడు. జిమ్ పూర్తి అయిన తర్వాత సూర్య ఇలా కనిపించాడు. సూర్య ఈ లుక్ లో చాలా విభిన్నంగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సూర్య తెల్ల గడ్డం రావడంతో పాటు జట్టు కూడా కాస్త తెల్లగా అయ్యింది. అయినా కూడా అజిత్ మాదిరిగా స్టైలిష్ గా బాగున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సూర్య తన రాబోయే సినిమాల్లో కనీసం ఒక్క సినిమాలో అయినా ఇలా సహజమైన లుక్ తో నటిస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సూరారై పోట్రు సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్న సూర్య ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.