Begin typing your search above and press return to search.

నాని సినిమాయే రిలీజ్ చేస్తుంటే.. మన సినిమా ఎంత..?

By:  Tupaki Desk   |   22 Aug 2020 1:40 PM IST
నాని సినిమాయే రిలీజ్ చేస్తుంటే.. మన సినిమా ఎంత..?
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో థియేటర్స్ క్లోజ్ అవడంతో సినిమా రిలీజులు ఆగిపోయాయి. అయితే నష్టాల నుండి బయటపడటానికి మరో ఆప్షన్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఉండటంతో మేకర్స్ అందరూ తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ముందుకొస్తున్నారు. హీరో రేంజ్ సినిమా బడ్జెట్ తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు ఒకే వేదికపై దర్శనమిస్తున్నాయి. మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు స్మాల్ మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే డిజిటల్ రిలీజ్ కి వెళ్తున్నప్పటికీ నేచుర‌ల్ స్టార్ నాని 'వి' సినిమాతో రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ మూవీస్ ఓటీటీలో విడుదలకు వచ్చే అవకాశం ఉంది. నాని - సుధీర్ బాబు హీరోలుగా నటించిన 'వి' సినిమాని సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూడా తన సినిమాని ఓటీటీలో విడుదల చేస్తుండటంతో ఇప్పుడు మిగతా మేకర్స్ డిజిటల్ రిలీజ్ గురించి ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలో ఓ యువ హీరో కూడా తన సినిమాని ఓటీటీ రిలీజ్ కి రెడీ చేయమని దర్శక నిర్మాతలని కోరుతున్నాడట.

కాగా టాలీవుడ్ యువ హీరో ఒకరికి ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ అవసరం ఉంది. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆ యువ హీరో కెరీర్ కొన్నాళ్ల పాటు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా సాగింది. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఆ తర్వాత అతని సినిమాలు వరుసపెట్టి ప్లాప్ అవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ హిట్ దర్శకుడితో ప్రాజెక్ట్ సెట్ చేసాడు యువ హీరో. సమ్మర్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈసారి కరోనా రూపంలో బ్యాడ్ టైమ్ అతన్ని వెంటాడింది. అయితే ఇప్పుడు 'వి' సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో తన సినిమాని కూడా అదే బాటలో నడిపించాలని కోరుతున్నాడట. నాని సినిమానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.. మన సినిమా ఎంత.. కంటెంట్ ఓల్డ్ అవకముందే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే కాస్త డబ్బులన్నా వస్తాయి.. ఓటీటీ రిలీజ్ కి మీ సైడ్ నుంచి నో అబ్జెక్ష‌న్ ఇవ్వండి అని సదరు హీరో దర్శకనిర్మాతలకు ప్రపోజల్ పెట్టాడట. సినిమా బాగుంటే మంచి కలెక్షన్స్ సాధించే హీరో నాని.. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తమ సినిమాని డిజిటల్ రిలీజ్ చేస్తుంటే.. ప్లాప్ హీరో అని ముద్రపడిపోయిన హీరో సినిమాని ఓటీటీలో విడుదల చేస్తే తప్పేంటని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.