Begin typing your search above and press return to search.

లేడీ ఓరియంటెడ్‌ మూవీలో స్టార్‌ హీరో లుక్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   3 Feb 2022 11:32 AM GMT
లేడీ ఓరియంటెడ్‌ మూవీలో స్టార్‌ హీరో లుక్ అదుర్స్‌
X
బాలీవుడ్‌ నుండి థర్డ్‌ వేవ్‌ తర్వాత రాబోతున్న మొదటి పెద్ద సినిమా గంగూభాయ్. స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్ ప్రథాన పాత్రలో రూపొందిన హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం ఇది. స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఆలియా భట్ ను మరో లెవల్‌ అన్నట్లుగా దర్శకుడు ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ మరియు గ్లిమ్స్ ను చూస్తుంటే అర్ధం అవుతుంది. సినిమా మొత్తం ఆలియా హవా కొనసాగుతుందని అనిపిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ఉన్నాడు అనే విషయాన్ని ఎక్కువగా ప్రచారం చేయకుండా చిత్ర యూనిట్‌ సభ్యులు సైలెన్స్‌ మెయింటెన్స్ చేశారు. ఎట్టకేలకు అజయ్ దేవగన్ లుక్ ను రివీల్‌ చేశారు.

హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలో హీరో అంటే పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అనే అభిప్రాయం ఉంటుంది. కాని ఈ సినిమాలో అజయ్ దేవగన్‌ లుక్ చూస్తుంటే ఖచ్చితంగా సినిమాకు ఆయన ప్రధాన ఆకర్షణగా ఉంటాడేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా అజయ్ దేవగన్ ఈ సినిమా లో హైలైట్‌ అవుతారంటూ ఈ ఫస్ట్‌ లుక్ పోస్టర్ ను చూసిన ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ పోస్టర్‌ సినిమా స్థాయిని మరింతగా పెంచింది. అజయ్ దేవగన్ వింటేజ్ లుక్‌ లో అదరగొట్టాడు. ముఖ్యంగా కోర్టు వేసుకుని క్యాప్‌ పెట్టుకుని బ్లాక్‌ అద్దాలతో వింటేజ్‌ కారు ముందు అలా నిల్చుని ఉంటే వావ్‌ అనిపిస్తుంది అంటూ అజయ్ దేవగన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గంగూభాయ్ సినిమా ట్రైలర్‌ ను రేపు లాంచనంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ను కేవలం హిందీలోనే కాకుండా పలు భాషల్లో ముఖ్యంగా సౌత్‌ భాషల్లో విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా తో ఎలాగూ ఆలియా భట్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఆమె గురించి తెలుగు మీడియాలో మరియు తెలుగు జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కనుక ఖచ్చితంగా గంగూభాయ్ సినిమా సౌత్‌ లో ముఖ్యంగా తెలుగు లో మంచి ఆధరణ దక్కించుకునే అవకాశం ఉంది. తెలుగు లో విడుదల చేసే విషయమై మేకర్స్ నుండి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఆ విషయమై విడుదల సమయంకు ఒక క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అజయ్‌ దేవగన్ కూడా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో నటించాడు. కనుక తెలుగు ప్రేక్షకులు వీరిద్దరి కాంబో మూవీ కనుక ఆధరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.