Begin typing your search above and press return to search.

తన సినిమా తనే చూడలేకపోయిన స్టార్

By:  Tupaki Desk   |   26 May 2018 1:58 PM IST
తన సినిమా తనే చూడలేకపోయిన స్టార్
X
ఒకప్పుడు మెరుపులు మెరిపించి.. కొత్త రూట్ చూపించిన దర్శకుడు.. ఇప్పుడు బాగా సీనియర్ అయిపోయి.. సినిమాలతో జనాలను మెప్పించలేకపోతున్నాడు. ఇతరేతర వ్యవహారాలలో చూపిస్తున్న ట్యాలెంట్ సినిమాల్లో కనిపించడం లేదు.

అప్పుడెప్పుడో ఈయనకు అసలంటూ అవకాశం ఇచ్చిన ఓ పెద్ద స్టార్ హీరో.. మళ్లీ ఈ దర్శకుడికి ఓ ఛాన్స్ ఇచ్చి చూశాడు. ఇప్పుడా సినిమా ఎట్టకేలకు ఎలాగోలా రిలీజ్ అయ్యేందుకు దగ్గరకు వచ్చింది. ఇప్పటివరకూ ప్రచారానికి కూడా రాని ఆ హీరో.. రీసెంట్ గా సినిమా స్క్రీనింగ్ కు అటెండ్ అయ్యాడట. తన సినిమా తాను చూసుకునేందుకు కూర్చుని.. 15 నిమిషాలకే తెగ ఇబ్బంది పడిపోయిన ఆయన.. సగం సినిమా పూర్తి కాగానే థియేటర్ ను వదిలి వెళ్లిపోవడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా వెళుతూ వెళుతూ.. ఏదో షార్ట్ ఫిలిం చూస్తున్నట్లుగా ఉంది అంటూ సెటైర్ కూడా వేసి మరీ నిష్క్రమించాడట ఈ స్టార్ హీరో.

ఈ సినిమాకు ఆ హీరో నిర్మాణం వహించలేదు కానీ.. తనే నిర్మాత అయితే మాత్రం కచ్చితంగా ఈ సినిమాను బాక్సుల్లోనే ఆపేసేవాడినని.. రిలీజ్ అన్న మాటే ఉండకపోదునని ఒకరిద్దరి దగ్గర కామెంట్ చేయడం బైటకు పొక్కింది. మరి ఇదే సినిమాతో ట్రెండ్ సృష్టిస్తానంటూ ప్రగల్భాలు పలికిన ఆ దర్శకుడు.. అంతగా హీరోనే భయపెట్టేలా ఆ సినిమాలో ఏం చూపించాడో?