Begin typing your search above and press return to search.

ఏజ్ బార్ అయ్యే కొద్దీ రొమాన్స్ డోస్ పెంచుతున్న స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   8 May 2022 3:30 AM GMT
ఏజ్ బార్ అయ్యే కొద్దీ రొమాన్స్ డోస్ పెంచుతున్న స్టార్ హీరో..!
X
ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలకు జోడీని ఫైనలైజ్ చేయడం అంత తేలికైన పని కాదు. అన్నీ పక్కాగా కుదిరినా హీరోయిన్ ని ఎంపిక చేసే విషయంలో మాత్రం దర్శకనిర్మాతలకు తలప్రాణం తోక్కొస్తుంది. హీరోల వయసుకు తగిన బ్యూటీని సెలెక్ట్ చేయకపోతే.. స్క్రీన్ మీద ప్రధాన జంటను చూడటానికి.. వారి మధ్య రొమాంటిక్ సన్నివేశాలను తిలకించడానికి ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయినప్పటికీ మన సీనియర్ హీరోలందరూ హాట్ గా ఉండే యంగ్ హీరోయిన్లకే మొగ్గు చూపుతుంటారు.

టాలీవుడ్ లో ఐదు పదుల వయసు దాటిన స్టార్ హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఇటీవల కాలంలో రవితేజ కుర్ర భామలతోనే రొమాన్స్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ర హీరో చేసిన సినిమాలు.. ప్రస్తుతం లైనప్ లో ఉన్న చిత్రాల్లో కథానాయికలను గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. 'ఖిలాడీ' సినిమాలో డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి వంటి ఇద్దరు హాట్ బ్యూటీస్ తో మాస్ రాజా రొమాన్స్ చేసారు. ఇద్దరితో లిప్ లాక్ సీన్స్ ఆ మధ్య నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అంతకముందు 'డిస్కో రాజా' సినిమాలో నభా నటేష్ - పాయల్ రాజ్ పుత్ వంటి యంగ్ హీరోయిన్స్ రవితేజతో జోడీ కట్టారు. అలానే ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'ధమాకా' సినిమాలో కుర్ర భామ శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకున్నారు. 'పెళ్లి సందD' చిత్రంలో తన ఏజ్ గ్రూప్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా సరసన నటించిన కథానాయికతో ఇప్పుడు రవితేజ రొమాన్స్ చేయనున్నారు.

ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో కూడా మాస్ రాజాకు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. 'మజిలీ' ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ మరియు 'కర్ణన్' భామ రజిషా విజయన్ ఇందులో సీనియర్ హీరోతో ఆడిపాడనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి ఇద్దరు ముద్దుగుమ్మలతో రామారావు రొమాన్స్ చేస్తాడని తెలుస్తుంది.

'రావణాసుర' సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ - ఫరియా అబ్దుల్లా - మేఘా ఆకాష్ - దక్ష నగార్కర్ - పూజిత పొన్నాడ వంటి అయిదుగురు హీరోయిన్లతో రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే సంగతి తెలిసిందే. అలానే మాస్ మహారాజా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో నిపూర్ సనన్ మరియు గాయత్రీ భరద్వాజ్ వంటి ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లను ఎంపిక చేసారు.

ఇలా రవితేజ లైనప్ చూస్తుంటే హాట్ గా ఉండే యంగ్ హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారని అర్థం అవుతుంది. దీంతో ఏజ్ బార్ అవుతున్నా మాస్ రాజా రొమాన్స్ లో ఏమాత్రం తగ్గడం లేదని.. వయసు పెరిగే కొద్దీ రొమాన్స్ డోస్ పెంచుతూ వస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జోడీగా ఆడిపాడటం వరకూ ఓకే కానీ.. మరీ ఓవర్ గా లిప్ లాక్ సన్నివేశాలు - ఇంటిమేట్ సీన్స్ లేకుండా చూసుకుంటే ఫ్యామిలీతో సినిమాకి వచ్చే ఆడియన్స్ కు ఇబ్బంది లేకుండా ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు.