Begin typing your search above and press return to search.

అప్పట్లో ఆ స్టార్ హీరో స్టాఫ్ కు చుక్కలు చూపించే వాడట!!

By:  Tupaki Desk   |   2 April 2020 10:30 PM IST
అప్పట్లో ఆ స్టార్ హీరో స్టాఫ్ కు చుక్కలు చూపించే వాడట!!
X
పైకి కనిపించేవన్నీ నిజాలు కాదు.. కనిపించనంత మాత్రాన అబద్ధాలు కాదు. ఆయనో పెద్ద స్టార్ హీరో. కెరీర్ మొదట్లోనే భారీ విజయాల తో ఇండస్ట్రీని షేక్ చేసిన హీరో. అయితే ఆ తర్వాత మాత్రం హిట్లు లేక వరస ఫ్లాపులతో బెంబేలెత్తిపోయాడు. ఒక దశలో ఇక కెరీర్ కూడా మటాష్ అయిందంటూ ప్రచారం సాగింది. ఆ సమయంలో ఆ స్టార్ హీరో కి ఓ చిత్రమైన.. అతి విచిత్రమైన అలవాటు ఉండేదట.

రోజు రాత్రి కాగానే ఫుల్లుగా మందు బిగించడం.. స్టాఫ్ ని ఏడిపించడమే పని.. వీలైతే కొట్టడం కూడా ఉండేది. ఇలా వ్యవహారం చాలా కాలం సాగిందట. అయ్యగారికి హిట్లు లేకపోవడం తో ఆ ఫ్రస్టేషన్ స్టాఫ్ పై చూపించడం తనకు ఫన్నీగా ఉండేదట.. ఈ దెబ్బకు బెంబేలెత్తి పోయిన స్టాఫ్ ఎంతోమంది ఆయన దగ్గర పని మానేశారని టాక్ వుంది.

తర్వాత హీరో గారికి ఒక హిట్టు తగలడం.. వరుసగా మరికొన్ని హిట్లు రావడం తో హీరోగారి ఫ్రస్టేషన్ లెవెల్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు కూల్ గా ఉంటున్నాడట. మందు తాగి.. కొట్టే అలవాటు కూడా పోయిందట. అంతేకాకుండా ఇండస్ట్రీలోని ఇతర హీరోల తో స్నేహం చేయడం కూడా మొదలు పెట్టాడట. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడంటే హిట్లు తగులుతున్నాయి. మళ్లీ గనుక వరుసగా 2 ఫ్లాపులు తగిలితే మళ్లీ ఆ వీరబాదుడు మొదలు పెడతాడేమోనని కొందరికి అనుమానం ఉంది. అయినా వయసుతో పాటు పరిణతి వస్తుంది కాబట్టి మళ్లీ ఆ యాక్షన్ పార్ట్ ను రిపీట్ చేయకపోవచ్చు. ఎలాగు హీరో కాబట్టి అంతగా కొట్టాలి అనిపిస్తే కెమెరా ముందు తన ప్రతాపం చూపిస్తే సరి.