Begin typing your search above and press return to search.

క‌న్న‌తండ్రితో స్టార్ హీరో గొడ‌వ‌లు క‌ల‌తలు?

By:  Tupaki Desk   |   30 Sept 2021 7:00 PM IST
క‌న్న‌తండ్రితో స్టార్ హీరో గొడ‌వ‌లు క‌ల‌తలు?
X
ప్ర‌ముఖ హీరోకి త‌న తండ్రి గారితో క‌ల‌త‌లు ఉన్నాయి. ఆ క‌ల‌త‌ల వ‌ల్ల వారు కొంత‌కాలంగా క‌లుసుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారే అన్న చందంగా ఉన్నారు. అయితే త‌ల్లితో మాత్రం ఆ హీరో స‌ఖ్యంగా ఉంటారు. క‌లుస్తారు.. మాట్లాడ‌తారు. ఆ మేర‌కు స‌ద‌రు హీరోపై త‌మిళ మీడియాలో ఇప్ప‌టికే క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరో అంటే.. ద‌ళ‌ప‌తి విజ‌య్. తన తండ్రి ప్రముఖ నటుడు-దర్శకుడు SA చంద్రశేఖర్ తో కుమారుడు విజయ్ కి విభేధాలొచ్చాయి.

త‌న తండ్రి చంద్ర శేఖ‌ర్ త‌న అనుమ‌తి లేకుండా `మక్కల్ ఈయక్కం` రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుండి కోలీవుడ్ స్టార్ ద‌ళ‌పతి విజయ్ తన తండ్రికి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల తన త‌ల్లిదండ్రులు రాజకీయ పార్టీ దుస్తులకు త‌న పేరు (విజ‌య్‌)ను ఫోటోలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టును కూడా ద‌ళ‌ప‌తి విజ‌య్ ఆశ్రయించాడు.

ప్ర‌స్తుతం దీనిపై త‌మిళ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. 2021 ఫిబ్రవరి 20 న జరిగిన జనరల్ బాడీ సమావేశం ముగిసిన వెంటనే `విజయ్ మక్కల్ ఐయక్కం` పార్టీని రద్దు చేశామ‌ని ద‌ళ‌ప‌తి తండ్రి ఎస్‌.ఏ చంద్రశేఖర్ హైకోర్టుకు తెలిపారు. విజయ్ తన తండ్రి .. తల్లిని తన ఇంట్లోకి రానివ్వలేదని అతన్ని కలవడానికి కూడా నిరాకరించాడని అప్ప‌ట్లో పుకార్లు వచ్చాయి.

అయితే SA చంద్రశేఖర్ తనకు త‌న‌ కుమారుడు విజయ్ కు సమస్యలు ఉన్నాయని అప్ప‌ట్లోనే వెల్లడించారు. కానీ విజయ్ అతని తల్లి శోభ మధ్య ఎలాంటి క‌ల‌త‌లు లేవు. వారు తరచుగా కలుసుకుని మాట్లాడుకుంటారని తెలుస్తోంది.