Begin typing your search above and press return to search.

'మై హ్యాపీనెస్' అంటూ స్టార్ హీరో ఫాదర్స్ డే పోస్ట్!

By:  Tupaki Desk   |   21 Jun 2021 1:30 AM GMT
మై హ్యాపీనెస్ అంటూ స్టార్ హీరో ఫాదర్స్ డే పోస్ట్!
X
సోషల్ మీడియా అనేది ప్రతి స్పెషల్ డేను మెమోరబుల్ గా మార్చే సాధనంగా మారిపోయింది. ఎందుకంటే ఏదైనా మనం షేర్ చేసుకునే విషయాలు ఎప్పటికి అలా సేవ్ చేసి ఉంచుతుంది. ఎన్నేళ్లు గడిచినా అలాగే మనకు గుర్తు చేస్తుంది. అందుకే ఎలాంటి స్పెషల్ డే వచ్చినా శుభాకాంక్షలు తెలియజేయడానికి సోషల్ మీడియానే ఉపయోగిస్తున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు అభిమానులతో ఇంటారాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియానే మెయిన్ వే. అందుకే ఏమున్నా ఇందులోనే షేర్ చేస్తుంటారు. అయితే ఈరోజు ఫాదర్స్ డే కావడంతో సోషల్ మీడియా మొత్తం బిజీ అయిపోయింది.

ఎప్పుడు ఓపెన్ చేసినా సోషల్ మీడియాలో ఫాదర్స్ డే పోస్టులే కనిపిస్తున్నాయి. అలాగే సినీ స్టార్స్ కూడా ఫోటోలు పోస్ట్ చేస్తుండటంతో ఫ్యాన్స్ అంతా లైక్స్ షేర్స్ అంటూ మరింత స్పెషల్ గా మార్చుతున్నారు. అయితే తాజాగా ఫాదర్స్ డే సందర్బంగా మలయాళం మెగాస్టార్ ఫోటో కూడా వైరల్ అవుతోంది. మలయాళం యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన తండ్రి మమ్ముట్టి ఫోటో స్పెషల్ పిక్ పోస్ట్ చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అవుతోంది. అయితే ఆ ఫోటో అంత వైరల్ కావడానికి మమ్ముట్టి మాత్రమే కాదు. ఆ ఫోటోలో స్పెషల్ పర్సన్ కూడా ఉంది.

ఆ స్పెషల్ క్యూటీ ఎవరో కాదు. దుల్కర్ సల్మాన్ కూతురు మరియమ్ కూడా ఉండటం విశేషం. అందులోను తాతయ్య మమ్ముట్టి పాపకు జుట్టు సరిచేసి ముడి వేస్తుండటం మరో విశేషం. ఈ ఫోటోలో మమ్ముట్టి కూడా తన లాంగ్ హెయిర్ ను పోనీటెయిల్ మాదిరి ముడుచుకుని ముద్దుల మనవరాలికి జుట్టు వేస్తుండటం అభిమానులను అట్ట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ తండ్రి కూతురు ఫోటో పోస్ట్ పెట్టి దుల్కర్ సల్మాన్.. 'మై హ్యాపీనెస్' అంటూ కాప్షన్ జోడించాడు. అంటే పిక్ చూసి మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగు డెబ్యూ మూవీ షూటింగ్ జరుపుతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే పేరుతో ఆ సినిమా తెరకెక్కుతుంది. చూడాలి మరి తెలుగు డెబ్యూ ఎలా జరుగుతుందో!