Begin typing your search above and press return to search.

నిరాశ‌లో స్టార్ హీరో ఫ్యాన్స్.. ఇంకెన్నాళ్లిలా?

By:  Tupaki Desk   |   14 July 2020 10:20 AM IST
నిరాశ‌లో స్టార్ హీరో ఫ్యాన్స్.. ఇంకెన్నాళ్లిలా?
X
త‌మ ఫేవ‌రెట్ హీరో కొంత గ్యాప్ త‌ర్వాత తిరిగి ముఖానికి రంగేసుకుని పెద్ద తెర‌పై క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వడంతో అభిమానుల్లో ఎక్క‌డా లేని ఉత్సాహం పొంగుకొచ్చింది. ఇలా మొద‌టి సినిమా మొద‌లైందో లేదో అలా రెండోది మొద‌లైపోయింది. ఆ వెంట‌నే వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల స్క్రిప్టులు రెడీ చేసేందుకు ద‌ర్శ‌కులు రెడీ అవ్వ‌డంతో ఆ ఉత్సాహం కాస్తా ప‌దింత‌లైంది. కానీ తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన చందంగా ఇంతలోనే మ‌హ‌మ్మారీ విరుచుకుప‌డింది. ఇది కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు.

ఓవైపు స్టార్ హీరోకి.. మ‌రోవైపు నిర్మాత‌కు ఊపిరాడ‌నివ్వ‌ని దెబ్బ ఇది‌. గ్యాప్ త‌ర్వాత సెట్స్ కెళ్లిన ద‌ర్శ‌కుడు నిండా నిరాశ‌లో మునిగాడు. స‌ద‌రు స్టార్ హీరో ప్లానింగ్ అంతా చ‌ప్పున చ‌ల్లారిపోయింది. ఇక స్టార్ హీరో ద‌ర్శ‌క‌నిర్మాత ను మించి ఫ్యాన్స్ మ‌రెంతో నిరుత్సాహానికి గుర‌య్యారు. ఆయ‌న న‌టించిన సినిమా చూసే నాలుగైదేళ్లు అయిపోవ‌డంతో ఇన్నాళ్టికి ఒక మంచి అవ‌కాశం.. మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్లోకి వ‌స్తుందా? అని వేచి చూసిన ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ త‌ప్ప‌లేదు. ఇక ఇప్పుడున్న స‌న్నివేశం చూస్తుంటే ఎప్ప‌టికి సినిమా వ‌స్తుందో కూడా తేల‌ని సందిగ్ధ‌త నెల‌కొంది.

షూటింగ్ లు ఇప్ప‌ట్లో మొద‌లు పెట్టే పరిస్థితి లేదు. దీంతో ఆ హీరో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. అలాగ‌ని ఇంకా ఎందుకు ఫాన్స్ ని ఇలా వెయిట్ చేయించడం.. ఆశ చూపించడం..! అందుకే ఆగష్టు నెలాఖరునాటికి షూటింగ్ ముగించాలని స‌ద‌రు నిర్మాత ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే ఇన్ఫో ఫాన్స్ కి చెప్పాల్సింది గా అభిమాన సంఘాల‌కు స‌మాచారం పంపించార‌ట‌. అయితే ఇలాంటి మెసేజ్ ల‌తో ఏం ఉప‌యోగం? మూవీ పూర్త‌యినా.. థియేట‌ర్లు తెరిచేది లేదు. బొమ్మ తెర‌పై ప‌డేది క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ మెసేజ్ తో ఏం సందేశం ఇవ్వ‌ద‌లిచారో?