Begin typing your search above and press return to search.
ముంబైలో స్టార్ హీరో కళ్లు చెదిరే భవంతి.. ప్రేయసి కోసమేనా?
By: Tupaki Desk | 19 July 2021 9:00 PM ISTరణబీర్ కపూర్ దేశంలోనే అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న పెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. అతడు ఇప్పటివరకూ తల్లిదండ్రులతోనే నివశించారు. తన తండ్రి రిషీ కపూర్ పాపులర్ ఆర్కే స్టూడియోను విక్రయించి భారీగా డబ్బును దాచి ఉంచారు. ఇప్పుడు అలా వచ్చిన పెట్టుబడితోనే రణబీర్ తన కొత్త ఇంటిని ముంబైలో నిర్మిస్తున్నారని సమాచారం.
రణబీర్ త్వరలో వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. పెళ్లితో లైఫ్ లో సెటిలవ్వాలన్నది అతడి ఆలోచన. దీని కోసం అతను తన కొత్త ఇంటిని నిర్మించడంలో బిజీగా ఉన్నాడు. అతని తల్లిదండ్రులు రిషి- నీతు ఇటీవల వరకు ఖరీదైన అపార్ట్ మెంట్లో నివసించేవారు. ఆ భవంతికి ధీటుగా ఇప్పుడు రణబీర్ తనకు ఖరీదైన ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ఇది సకల సౌకర్యాలతో ఇంద్రభవనాన్ని తలపిస్తుందని చెబుతున్నారు.
ఈ ఇంటి కోసం రణబీర్ 40 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాడని తెలిసింది. అతను తన తల్లితో కలిసి ఈ ఇంట్లోకి గృహ ప్రవేశం చేస్తాడు. అతని వివాహ ప్రణాళికలు కూడా ఇప్పటికి రహస్యంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అతను పెద్ద కలల సౌధాన్ని వేగంగా పూర్తి చేయాలనే ప్రణాళికలో ఉన్నాడు. నిజానికి ఈ ఇంటిని నిర్మించడానికి కారణం తన ప్రేయసికి కానుకగా ఇచ్చే ఆలోచనతోనే..! అంటూ అభిమానుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దానిని రణబీర్ ఇప్పటివరకూ ధృవీకరించలేదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం రణబీర్ యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సందీప్ వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో రణబీర్ సరసన పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తోంది. పరిణీతి ఇటీవల వరస చిత్రాలతో నటిగా క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసినదే. అనీల్ కపూర్ .. బాబి డియోల్ లాంటి వెటరన్ స్టార్లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్ని పోషిస్తున్నారు.
ఇక యానిమల్ టైటిల్ పైనా ఈ సినిమా కథాంశంపైనా సోషల్ మీడియాల్లో ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. మరోసారి కబీర్ సింగ్ తరహాలోనే హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో సందీప్ వంగా సర్ ప్రైజ్ చేస్తాడనే భావిస్తున్నారు. ఇక ఈ మూవీలో నిత్యం గొడవలు పడే తండ్రి కొడుకుల రిలేషన్ షిప్ ని వయొలెంట్ కంటెంట్ తో చూపించనున్నారని తెలుస్తోంది. ఎంచుకున్న థీమ్ లైన్ కచ్ఛితంగా థ్రిల్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2022 దసరా కానుకగా రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ ప్రస్తుత సందిగ్ధత వల్ల రిలీజ్ తేదీపై క్లారిటీ రావాల్సి ఉంటుంది.
అమితాబ్ బచ్చన్ - షారూక్ - రేఖ - అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్- హేమ మాలిని- రాజేష్ ఖన్నా- అక్షయ్ కుమార్ - అనీల్ కపూర్ - ఫర్హాన్ అక్తర్ - సంజయ్ దత్- సోనాక్షి సిన్షా.. షాట్ గన్ శత్రుఘ్న తదితరులు నిర్మించిన భవనాలు ముంబైలో అత్యంత విలాసవంతమైనవి సౌకర్యమైనవిగా పాపులరయ్యాయి. ఇప్పుడు రణబీర్ వాటన్నిటినీ తలదన్నేలా గొప్ప విదేశీ ఇంటీరియర్ తో భవంతిని నిర్మించాలని కలలుగంటున్నాడట.
తండ్రి రిషీ మరణం బిగ్ లాస్ 2020 ఏప్రిల్ లో తన తండ్రి ప్రముఖ నటుడు రిషి కపూర్‌ను కోల్పోయిన అనంతరం రణబీర్ కపూర్ చాలా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నష్టానికి సంబంధించి తాను ఇంకా కోలుకునే ప్రయత్నంలో ఉన్నానని రణబీర్ ఎమోషనల్ అయ్యారు.
వృత్తిపరంగా వ్యక్తిగతంగా రిషి తన జీవితంపై చూపిన భారీ ప్రభావం గురించి కూడా రణబీర్ మాట్లాడారు.క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత ఏప్రిల్ 30 ఉదయం రిషి మరణించారు. ఆయనకు భార్య నీతు కపూర్,.. కుమారుడు రణబీర్.. కుమార్తె రిద్దిమా కపూర్ సాహ్ని ఉన్నారు.
గత రెండేళ్ళలో నేను అతనితో గడిపిన సమయం.. క్యాన్సర్ కి కీమోథెరపీ పొందుతున్నప్పుడు హోటల్ నుండి ఆసుపత్రికి నాన్నతో నడుస్తూ నిశ్శబ్దంగా తనతోనే ఉన్నాను. అంతా చాలా వేగంగా జరిగింది.. అని రణబీర్ అన్నారు.