Begin typing your search above and press return to search.
స్టార్ హీరో డాటర్ హాట్ కిల్లర్ లుక్ వైరల్
By: Tupaki Desk | 21 Feb 2021 4:26 PM ISTప్రపంచంలో నా పిల్లల్లాంటి ఆణిముత్యాలు ఇంకెవరూ ఉండరు! అంటూ కితాబిచ్చారు బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి. డ్రగ్స్ లో నటవారసులు! అన్న తప్పుడు వ్యాఖ్యానాలు తనకు నచ్చవని అన్నారు. నిజమే అతడి కుమారుడు అహన్ శెట్టి ఆర్.ఎక్స్ 100 హిందీ రీమేక్ తో బరిలో దిగుతున్నాడు కాబట్టి.. అతడికి ఇలాంటి ప్రోద్బలం అవసరం. అలాగే వారసురాలు ఆతియాకు కూడా కెరీర్ పరంగా బోలెడంత సపోర్ట్ కావాలి.
మరోవైపు అతియా శెట్టి క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో నిండా ప్రేమాయణం సాగించడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆతియా సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లు మంటలు పుట్టిస్తున్న సంగతి తెలిసినదే.
అభిమానులకు `మేకప్ తో సరదా ప్రయోగాలు చేయండి` అంటూ సలహా ఇస్తుంటుంది ఈ భామ. ఇదిగో ఆతియా అలాంటి ప్రయోగాల్ని ఇన్ స్టా వేదికగానూ రివీల్ చేస్తుంటుంది. వాటికి అభిమానుల నుంచి స్పందన అంతే ఇదిగా ఉంటుంది. ఆతియా బ్లాక్ టూపీస్ లో ఎంతో హాట్ గా కనిపిస్తోంది. ఇక ఆ మెడలో మల్లె చెండును తలపించేలా ఆ గవ్వల ఆభరణం ఏమిటో కానీ చాలా వెరైటీగానే ఉంది. సూదంటు చూపులతో ఈ నటవారసురాలు చంపేస్తోంది. ఆతియా శెట్టి మేకప్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటుంది. ఆ ప్రయోగాలలో ఒక థీమ్ లుక్ ఇది. ఇంటర్వ్యూల్లోనూ మేకప్ చిట్కాలు ఉపాయాలు నిరభ్యంతరంగా చెబుతుంటుంది ఆతియా.
ఇన్‌స్టాలో ఆతియాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రకరకాల ఫ్యాషన్ ఫోటోషూట్ లను.. సెల్ఫీలను వీడియోల్ని పంచుకోవడంతో ఆమెకు భారీ ఫాలోయింగ్ పెరిగింది.
ఉత్తమ అరంగేట్రం కథానాయికగా..ఫిలింఫేర్ నామినేషన్ కి వెళ్లిన ఆతియా `హీరో` అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. కాస్మోపాలిటన్- వెర్వ్ - హార్పెర్స్ బజార్ వంటి అనేక ఉన్నత స్థాయి పత్రికల ముఖచిత్రంగానూ ఆతియా కనిపించింది. అతియా శెట్టి సినిమాల్లో ముబారకన్ .. మోటిచూర్ చక్నాచూర్ ఇంతకుముందు రిలీజై ఫ్లాపయ్యాయి `హోప్ సోలో` అనే బయోపిక్ చిత్రంలో నటించగా అది రిలీజ్ కి సిద్ధమవుతోంది.