Begin typing your search above and press return to search.

స్టార్ హీరో దృష్టంతా అతని మీదే ఉందట!

By:  Tupaki Desk   |   24 Sept 2019 11:00 PM IST
స్టార్ హీరో దృష్టంతా అతని మీదే ఉందట!
X
అతనో స్టార్ హీరో. ఇక్కడే కాదు ఎక్కడో కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ అతని సొంతం. ఏడాదిన్నర క్రితం చేసిన భారీ సినిమా ఒకటి డిజాస్టర్ కావడంతో చాలా జాగ్రత్త తీసుకుని నెలల తరబడి వెయిట్ చేసి మరీ ఒక ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాడు. మాటలతో మేజిక్ చేస్తాడని పేరున్న దర్శకుడితో మొత్తానికి ఆ సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోయి ప్రస్తుతం షూటింగ్ లో ఉంది. అయితే స్క్రిప్ట్ లో నిర్మాణ విషయాల్లో తరచూ జోక్యం చేసుకునే అలవాటున్న ఈ హీరోకి సదరు దర్శకుడు ఆ అవకాశం ఇవ్వడం లేదట.

కేవలం చెప్పినట్టుగా నటించడం ప్యాక్ అప్ చెబితే వెళ్లిపోవడం తప్ప అంతకు మించి ఎలాంటి విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు తీసుకున్నాడట. గతంలో రెండు సినిమాలు అతనితోనే పని చేసిన అనుభవం ఉండటంతో ఏమి అనలేని పరిస్థితి. కానీ తర్వాత చేయబోయే మరో క్రేజీ డైరెక్టర్ సినిమా మీద ఈ హీరో ఫుల్ గా ఫోకస్ పెడుతున్నాడని తెలిసింది. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కనుక్కోవడం మార్పులు చేర్పుల గురించి చర్చలు కొనసాగించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయట.

ఈ దర్శకుడు గత ఏడాది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించాడు. ఇంకో అగ్ర హీరో మాట ఇచ్చి మిస్ చేయడంతో ఇప్పుడీ స్టార్ దగ్గర ఓకే చేయించుకున్నాడు. ఈ హీరో రెండో సినిమాకే అతి పెద్ద బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కావడంతో పూర్తి స్వేచ్ఛ తీసుకుని చాలా సుదీర్ఘమైన ముంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి ముందొచ్చే కొమ్ముల కన్నా వెనుకొచ్చే సామెత తరహాలో చేస్తున్న సినిమా కన్నా తర్వాత చేయబోయే దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్న సదరు స్టార్ ఉద్దేశం ఏమిటో మరి