Begin typing your search above and press return to search.

ఈ ఏడాది 3 సినిమాలతో వస్తున్న స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   9 March 2021 11:30 AM GMT
ఈ ఏడాది 3 సినిమాలతో వస్తున్న స్టార్ హీరో..!
X
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'అసురన్' కి రీమేక్ గా ''నారప్ప'' చిత్రాన్ని పూర్తి చేశాడు వెంకీ. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై సురేష్ బాబు మరియు క‌లైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలానే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' ఫ్రాంచైజీలో ''ఎఫ్ 3'' సినిమాలో నటిస్తున్నారు వెంకటేష్. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఇటీవలే 'దృశ్యం' సీక్వెల్ గా ''దృశ్యం 2" చిత్రాన్ని స్టార్ట్ చేశారు.

మలయాళంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న 'దృశ్యం 2' సినిమాని విక్టరీ వెంకటేష్ - మీనా ప్రధాన పాత్రలతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ పై డి. సురేష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. అయితే సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ని స్టార్ట్ చేసి కేవలం 50 రోజుల్లో పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ లేదా జూలైలో 'దృశ్యం 2' ని విడుద‌ల చేయాలని వెంకీ అండ్ టీమ్ ఆలోచన చేస్తోందట. టాలీవుడ్ లో వెంకీ - మీనా కాంబోకి సూప‌ర్ హిట్ పెయిర్ అనే సెంటిమెంట్ ఉంది. దీనిని బట్టి చూస్తే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయ‌నే చెప్పాలి. ఏదేమైనా ఈ ఏడాది మొత్తంగా మూడు సినిమాలతో వెంకటేష్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడని చెప్పవచ్చు.